విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలి
విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలి
– గంగారం మోడల్ స్కూల్ సందర్శన
– మంత్రి శ్రీధర్ బాబు
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: జయశంకర్ భూపా లపల్లి జిల్లా కాటారం మండలంలోని గంగారం మోడల్ స్కూల్ ను కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ తో కలిసి రాష్ట్ర ఐటీ, ఈ సీ, ఐ సీ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం ఉపా ధ్యాయులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి పాఠశాలకు సంబంధించిన పలు మౌలిక వసతుల గురించి అడిగి తెలు సుకున్నారు. అలాగే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిం చాలని, మెను ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. పాఠశాలకు సంబంధించిన ఏ చిన్న సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకవస్తే తక్షణమే సమస్యలు పరిష్కా రం అయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతూ అందరూ క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలని అధిరోహించాలని తెలిపారు. విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంత రం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యా సంస్థలను, ప్రైవేటు విద్యాసంస్థల కంటే మెరుగ్గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు మెరుగు పరిచి ఉన్నతమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. అంతకుముందు వర్షం లో సైతం గంగారం లో పలు కుటుంబా లను పరామర్శించారు.