భారి వర్షం తో అతలాకుతలం – స్తంభించిన జనజీవనం
– ఉప్పోంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : గోదావరి వర దలు, భారీ వర్షాలతో గత వారం పది రోజులుగా ఇబ్బందులు పడిన ప్రజలు అవన్నీ తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మరల ఆదివారం నుండి బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. ఆదివారం నుండి సోమవారం కూడా ఎటువంటి విరామం లేకుండా కుండపోత వర్షంతో పల్ల పు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. అనేక కొండవాగులు, పెద్దవాగులు సైతం రికార్డు స్థాయిలో పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక చోట్ల చెట్లు విరిగి పడ్డట్లు సమాచా రం. భారీ వర్షాలు మరో 36 గంటల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటనలతో ప్రభుత్వ యంత్రాంగం అప్ర మత్తమైంది. వాగులు, వంకలు దాటవద్దని, చేపల వేటకు వెళ్ళవద్దని, ఇతర భారీ వర్షాలు వరద భద్రతాపరమైన హెచ్చరికలను రెవెన్యూ పోలీస్ యంత్రాంగం ప్రజలకు తెలి యపరుస్తున్నారు. వర్షాలు కారణంగా వ్యవసాయ పనులు స్తంభించిపోయాయి. అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు అంత రాయం ఏర్పడినట్లు సమాచారం. నూగూరు వెంకటాపురం పట్టణంలో ప్రధాన మార్కెట్ సెంటర్, బస్టాండ్ సెంటర్ లు వర్షాల కారణంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.