చిన్నబోయినపల్లిలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో స్పెషల్ ప్రోగ్రాం

చిన్నబోయినపల్లిలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో స్పెషల్ ప్రోగ్రాం

ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : మండలంలోని చిన్నబోయినపల్లి లో డాక్టర్ రాధిక ప్రోగ్రాం ఆఫీసర్, వాలంటరీస్ ,టి టి డబ్ల్యూ ఆర్ డిసి ములుగు ప్రోగ్రాం ఆఫీసర్ ఆధ్వర్యంలో 7 రోజుల స్పెషల్ క్యాంపు ఏర్పాటు చేషారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రాధిక మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం చిన్నబోయినపల్లి లో నిర్వహించాలని కేయూ నుంచి అలర్ట్ చేశారన్నారు. ఈ గ్రామానికి సంబంధించిన రిక్రూట్మెంట్ ఏమున్నాయో, ఏం అవసరం ఉన్నాయో, లేకపోతే ఏం చేయాలి ఇక్కడున్న వాతావరణం, ప్రజల ఆరోగ్య సమస్యలు, లోకల్ ఏరియాస్ లో ఉన్నటువంటి చెత్తాచెదారాన్ని క్లీన్ అండ్ గ్రీన్ ఎలా ఉంచాలో అనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ క్యాంపు ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏడు రోజుల ప్రోగ్రాంలో ఎలాంటి సమస్యలనైనా తమవల్ల సాధ్యమై నంత మేరకు పరిష్కరించి వెళ్తామన్నారు. మాకు సహకరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాలంటరీస్ అండ్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి ఉమాదేవి, పి టి డబ్ల్యూ ఆర్ డి సి గర్ల్స్, వాలంటరీస్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.