శ్రీ బాలాజీ మున్నూరు కాపు సహకార ప్రభుత్వ సంఘం బలోపేతానికి కృషి చేస్తా
– నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చింతనిప్పుల బిక్షపతి, సుంకరి రవీందర్
ములుగు, మార్చి 31, తెలంగాణ జ్యోతి : శ్రీ బాలాజీ మున్నూరు కాపు సహకార ప్రభుత్వ సంఘం బలోపేతానికి కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చింతనిప్పుల బిక్షపతి, సుంకరి రవీందర్ తెలిపారు. ములుగు మండల కేంద్రంలో శ్రీ మున్నూరు కాపు పరపతి సంఘం వార్షిక సర్వసభ్య సమావేశం తాత్కాలికా అధ్యక్షులు సత్తు రామనాథం అధ్యక్షతన ఆదివారం గట్టమ్మ సమీపంలోని బండారి హరినాధం మామిడి తోటలో జరిగింది. ఈ సమావేశంలో నూతన అధ్యక్షులుగా చింతనిపుల బిక్షపతి, ఉపాధ్యక్షులుగా జయకర్, ప్రధాన కార్యదర్శి గా సుంకరి రవీందర్, కోశాధికారిగా తోట తిరుపతి, సంయుక్త కార్యదర్శిగా గందె శ్రీను, డైరెక్టర్స్ గా అనుముల సురేష్, శీలం వేణు, ఆకుల రాజు, గందె మధు, ఎడ్ల రాజ్ కుమార్, గంధం విజేందర్ లు నియమితులయ్యారు. ఆడిట్ సభ్యులుగ ఎడ్ల సంపత్ ఎన్నుకోన్నారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు సిరికొండ బలరాం బిజెపి జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా శ్రీ బాలాజీ మున్నూరు కాపు సహకార పరప సంఘం సభ్యులు సిరికొండ బలరాం ఎన్నిక కావడం పట్ల కాపు సంఘం హర్షం వ్యక్తం చేసి శాలువతో సన్మానించారు. ఈ సమావేశంలో 96 మంది సంఘ సభ్యులు పాల్గొని సంఘ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. నూతన కమిటీ ఎన్నికలకు సహకరించిన సభ్యులందరికీ అధ్యక్షులు చింతనిపుల బిక్షపతి సంఘం తరపున కృతజ్ఞతలు తెలిపారు.