కాళేశ్వరంలో వసంత పంచమి సందర్భంగా అమ్మవారికి  ప్రత్యేక పూజలు.

కాళేశ్వరంలో వసంత పంచమి సందర్భంగా అమ్మవారికి  ప్రత్యేక పూజలు.

తెలంగాణ జ్యోతి, కాళేశ్వరం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహాదేవపూర్ మండలం కాళేశ్వరం లో వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరిం చుకుని మహా సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి అనుబంధ ఆలయం శ్రీ మహా సరస్వతీ అమ్మవారి ఆలయంలో వసంత పంచమి సందర్భముగా ఆలయంలో సరస్వతీ అమ్మవారికి అర్చకులు వేదపండితులు ప్రత్యేక అలంకరణ, ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి సామూహిక అక్షర శ్రీకార మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమం అనతరం పిల్లలకి పలక లు, బలపాలు, పుస్తకాల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణాధికారి మహేష్ కాళేశ్వరం ఎంపీటీసీ రేవెల్లి మమత నాగరాజు ఆలయ ధర్మకర్తలు అడప సమ్మయ్య , శ్యాం సుందర్ దేవ్డా మరియు అధిక సంఖ్యలో భక్తులు గ్రామస్థులు పాల్గొన్నారు.

మహాదేవపూర్ మండల్ ప్రతినిధి /ఆరవెల్లి సంపత్ కుమార్