ఆర్టీసీ బస్ స్టేషనా.. లేక చెత్త డంపింగ్ యార్డా..? 

Written by telangana jyothi

Published on:

ఆర్టీసీ బస్ స్టేషనా.. లేక చెత్త డంపింగ్ యార్డా..? 

– పట్టించుకోని పంచాయతీ, ఆర్టీసీ అధికారులు. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా మండల కేంద్రమైన నూగూరు వెంకటాపురం పట్టణం నడిబొడ్డున ఉన్న టి.ఎస్.ఆర్టిసి బస్ స్టేషన్ ఆవరణ చెత్త డంపింగ్ యార్డ్ గా మారిపోయింది. పట్టణంలోని వివిధ పెద్ద, చిన్న, చిరు వ్యాపారులు ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను బస్ స్టేషన్ ఆవరణ లో పారబోస్తున్నారు. సుమారు 2.30 ఎకరాల విస్తీర్ణం లో ఉన్న బస్స్టేషన్ ఆవరణతో పాటు, పక్కనే ఉన్న మరో విశాల మైన దేవస్థానం భూములు, గ్రౌండ్లలో ప్రధాన రహదారి, ప్రధాన మార్కెట్ సెంటర్ ఉన్న వ్యాపారులు, ప్లాస్టిక్ వ్యర్ద పదార్థాలను విచక్షణారహితంగా ఆవరణ లో పారబోస్తున్నారు. మరో విశేషమేమంటే పట్టణంలోని శివాల యం వద్ద నుండి ప్రధాన రహదారికి ఇరువైపులా రోడ్లు భవనాలు శాఖ ఆధ్వర్యంలో దశాబ్దం క్రితం సుమారు 90 లక్షల రూపాయలుతో మురుగు నీటి ప్రవాహం డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్ స్టేషన్ షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభ షాపు వద్ద, రాజకీయ పార్టీల ముసుగులో ఉన్న కొంతమంది వ్యాపారులు డ్రైనేజీని, ఆర్టీసీ బస్ స్టేషన్ అవుట్ గేటు వద్ద ధ్వంసం చేశారు. డ్రైనేజీని పగలగొట్టడంతో , వెంకటాపురం పట్టణం నుండి రహదారి ఒకపక్క నుండి ప్రవహించే మురుగునీరు సుమారు కిలోమీటర్ దూరం నుండి ప్రవహిస్తూ మురుగునీరు ఆర్టీసీ బస్ స్టేషన్ అవుట్ గేట్ పక్కనున్న షాపు కింది భాగం నుండి దుర్గంధ భరితమైన మురుగునీరు బస్ స్టేషన్ ప్రాంగణం నుండి 365 రోజులు ఎల్లవేళలా మురుగు నీరు ప్రవహిస్తోంది. ఊర పందులు జలకా లాటల తోపాటు ,మురుగును కుమ్మి , సుమారు డ జనుకు పైగా సంతానం కలిగిన వరహాల పిల్లలు , తల్లి తమ చిన్నారి వరహాలకు మురుగును కుమ్మి జలకాలాడే విధానం పై శిక్ష ణ నిస్తుండ టంతో, ముక్కుపుటాలు అదిరే దుర్గంధం గుంపుల ఊర వరహా లతో వ్యాప్తి చెందుతున్నది. ఇవి ప్రయాణికులకు దర్శనమిస్తు న్నాయి. మురుగునీటి గుంటలలో ఊర వరాహాలు జలకాలా డుతూ కుమ్ములాడు కుంటూ ఉండటంతో బస్సుల కోసం వేసి ఉన్న ప్రయాణి కులకు ముక్కు పుటాలు అదిరే విధంగా దుర్గంధం తో నాసికా రంధ్రాలకు మహిళా ప్రయాణీకులు పైట కొంగులను ముక్కుల వద్ద వాడు తున్నారు. బిర్యాని పాయింట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటల్ ,ఇతర వ్యాపారులు పారేసిన ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, కవర్లు, విస్తరాకులు ,,ఇతర పదార్థాలు బస్ స్టేషన్ ఆవరణలో డంపింగ్ యార్డ్ గా పారవేస్తున్నారు. గ్రామపంచాయతీల పాలకవర్గం పదవీకాలం ముగిసిన తరువాత ప్రత్యేక అధికారులు పాలన కొనసాగుతున్న, సుమారు పదివేల జనాభా కలిగిన వెంకటాపురం పట్టణం లో నడిబొడ్డు న ఆర్టీసీ బస్ స్టేషన్ ఆవరణ మురుగు నీటి ప్రవాహం, ఉర వరాహాల జలకాలా ఆటలు, అంటువ్యాధులు వ్యాప్తి చెందుతున్నాఇ. పారిశుద్ధ్యం పనులు చేపట్టటంలేదని ఇటు ప్రయాణికులు, అటు పట్టణ ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అంతేకాక వెంకటాపురం మేజర్ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది ట్రాక్టర్లలో సేకరించిన చెత్తాచెదారం శివాలయం రోడ్డు నుండి రాచపల్లి మల్లాపూర్ వెళ్లే ప్రధాన రహదారి వెంకటాపురం శివారు కంకలవాగు ఒడ్డున ట్రాక్టర్లతో డబ్బింగ్ చేస్తున్నారు. అక్కడికి కూత వేటు దూరంలో చెత్త డంపింగ్ యార్డ్, వైకుంఠధామం అన్నీ ఉన్నా డంపింగ్ యార్డ్ లో చెత్తను పార బోయకుండా కంకల వాగు ఒడ్డున పారబోతుండడంతో, జల కాలుష్యం ఏర్పడుతున్నది. ఇటీవల రాచపల్లి, మల్లాపురం వెళ్లేందుకు కంకల వాగు పై వంతెన నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మరో విశేషం అంటే వెంకటాపురం పంచాయతీ సిబ్బంది కంకల వాగుకు 100 మీటర్ల దూరంలో ఉన్న డంపీంగ్ యార్డు కు చెత్త ట్రాక్టర్లు వెళ్లకుండా, వెంకటాపురం శివారు మంగపేట రోడ్ శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం మంగపేట రోడ్ లో ఉన్న గోదావరి పాయలో చెత్తను డప్పింగ్ చేస్తున్నారు. అయితే మిర్చి పంట రైతులు తమ పండు మిరపకాయలను మంగపేట రోడ్డు గోదావరి పాయలో పోస్తుండటంతో రైతులు చెత్తను తీవ్రస్థాయిలో వ్యతిరేకించ డంతో, మేజర్ పంచాయతీ చెత్త డంపింగ్ ను రూట్ మార్చారు. మంగపేట గోదావరి పాయలో మిర్చి రైతుల అభ్యంతరంతో శివాలయం రాసపల్లి మల్లాపురం కంకల వాగు రోడ్డున పారబోసే విధానం పై కూడా అభ్యంత రాలు రావడంతో, పంచాయతీ కార్మికులు చెత్త ట్రాక్టర్లు డంపింగ్ యార్డ్ కు తరలిస్తున్నారు. ఈ తతంగమంతా వర్షాకాల ం లో ప్రారంభం నుండి నెలల తరబడి మంగపేట గోదావరి పాయ , శివాలయం కంకల వాగు , వెంకటాపురం బస్ స్టేషన్ ఆవరణలలో గుట్టలు గుట్టలుగా చెత్త పేరుకు పోతున్నది. వెంకటాపురం బస్ స్టేషన్ నుండి భద్రాచలం, వరంగల్ రెండు డిపోలకు చెందిన సుమారు 20 బస్సులు రాకపోకలు సాగిస్తుండగా ప్రతినిత్యం సుమారు 2,000 వేల మంది ప్రయాణికులు వెంకటాపురం బస్ స్టేషన్ నుండి ప్రయాణాలు సాగిస్తున్నారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన వెంకటాపురం పట్టణంలోని ప్రయాణికుల ప్రాంగణం, అపరిశుభ్రతకు నిలయంగా మారింది. ఆర్టీసీ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, ఆర్టీసీ ప్రాంగణాన్ని చెత్త రహిత ప్రాంగణంగా, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని, అలాగే వెంకటాపురం మేజర్ పంచాయతీకి తగు ఆదేశాలు జారీ చేయాలని, ములుగు జిల్లా కలెక్టర్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్టీసీ రీజినల్ మేనేజర్, భద్రాచలం ఆర్టీసీ డిపో మేనేజర్ లకు వెంకటాపురం పట్టణ ప్రజలు పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now