విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ
విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ
– జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
కాటారం, తెలంగాణజ్యోతి ప్రతినిధి: జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ బుధవారం కాటారం మండలంలో విస్తృతంగా పర్యటించారు. యూత్ ట్రైనింగ్ కేంద్రం, కెజిబివి పాఠశాల, గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో పాఠాలు చదివించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు తరచూ వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశిం చారు. ఏదేని అత్యవసర సేవలకు జిల్లా కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ఆరోగ్యం బాగా లేక ఇండ్లకు వెళ్లిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వాకబు చేయాలని సూచించారు. సంక్షేమ వసతి గృహల్లో సోలార్ హీటర్లు, ఆర్ ఓ ప్లాంట్స్ ఏర్పాటుకు మండల ప్రత్యేక అధికారుల ద్వారా ప్రతిపాదనలు పంపాలని సూచించారు. వినియోగానికి పనికిరాకుండా నిరుప యోగంగా ఉన్న వస్తువు లను తొలగించాలని ఆదేశించారు. గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలల్లో డార్మెటరి అప్పగించక పోవడం వల్ల విద్యార్థులు ఆరుబయట భోజనం చేయాల్సి వస్తుందని తక్షణమే డార్మెటరి అప్పగించు విదంగా చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ డిడిని ఆదేశించారు. అదేవిధంగా యూత్ ట్రైనింగ్ కేంద్రం నిర్వహణ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భవనం నిర్వహణ లోపం వల్ల నిరుపయోగంగా ఉందని, వినియోగంలోకి తేవాలని వారం రోజుల్లో పూర్తి స్థాయిలో మరమ్మతులు నిర్వహించి ముస్తాబు చేయాలని ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖ డిడి ఒక్క సమావేశానికి కూడా రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కేజీబివి పాఠశాలల్లో చేపట్టిన మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. వంట సామాన్లు భద్రపరచు గదిని పరిశీలించారు. మెనూ ప్రకారం ఆహార పదార్థాలు అందించా లని తెలిపారు. నిత్యావసర సరుకులు సకాలంలో సరఫరా జరుగుతుందా లేదా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమా ల్లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిపిఓ. నారాయ ణరావు, జిల్లా వైద్యాధికారి డా మధుసూదన్, ఆర్డిఓ మంగి లాల్, తహసీల్దార్ నాగరాజు కళశాలల ప్రిన్సిపాల్స్ తదిత రులు పాల్గొన్నారు.