ప్రభుత్వ భూముల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి
– జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: ప్రభుత్వ భూముల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధ వారం కాటారం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ, అట వీ, ఐటీఐ, టిజిఐఐసి అధికారులతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాటారం డివిజన్ లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు భూమి అవస రం ఉందని, ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నా రు. కాటారం లో ఐటీఐ, టిజి ఐఐసి కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయించామని, పనులు ఎందుకు ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమి లభించడమే కష్టమైన నేపథ్యంలో ఎన్నో ప్రయాసలకు లోనై భూమి కేటా యించామని తక్షణమే పనులు చేపట్టాలని ఆదేశించారు. రెండు రోజుల్లో పనులు ప్రారంభం కాకపోతే నివేదికలు అందచేయాలని తహసీల్దార్ ను ఆదేశించారు. ప్రభుత్వ సర్వే నంబర్స్ భూములు రిజిస్ట్రేషన్ చేయకుండా పటిష్ఠ రక్షణ చర్యలు చేపట్టాలని, రిజిస్ట్రేషన్ శాఖకు లేఖ వ్రాయాలని ఆదేశించారు. అలాగే ప్రభుత్వ స్థలంలో ఇండ్ల నిర్మాణాలకు ఇంటి నంబర్స్ కేటాయించొద్దని డిపిఓ కు సూచించారు. ప్రభుత్వ భూముల్లో ఇండ్ల నిర్మాణాలు చేపడితే కూల్చివేతే చర్యలు చేపట్టాలని తహసీల్దార్ ను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిపిఓ నారాయ ణరావు, ఆర్డిఓ మంగిలాల్, డీ ఎం హెచ్ ఓ మధుసూదన్, తహసీల్దార్ నాగరాజు, ఐటీఐ ప్రిన్సిపాల్ భిక్షపతి, టిజిఐఐసి డి ఈ స్మరత్ చంద్ర, కస్తూర్బా గాంధీ గురుకులం ప్రత్యేక అధి కారిని చల్ల సునీత, డాక్టర్ మౌనిక తదితరులు పాల్గొన్నారు.
ఆకస్మిక తనిఖీలు
కాటారం సబ్ కలెక్టర్ కార్యాలయం కోసం కాటారం లో గల యూత్ ట్రైనింగ్ సెంటర్ను, కొత్తపల్లి లో ఎల్ ఆర్ ఎస్ ప్రక్రియ ను పరిశీలించారు. అనంతరం కస్తూర్బా గాంధీ బాలి కల గురుకుల పాఠశాలను, ట్రైబల్ బాలికల రెసిడెన్సిషియల్ పాఠశాల ను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లను, గారెపల్లి లో బాలాజీ ప్రైవేట్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.