మానవత్వం చాటుకున్న ఎస్పీ శబరీష్
మానవత్వం చాటుకున్న ఎస్పీ శబరీష్
– బైక్ పై నుంచి పడిన వ్యక్తికి చికిత్స
తెలంగాణ జ్యోతి ప్రతినిధి, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ పి.శబరీష్ మానవత్వం చాటుకున్నారు. నిత్యం పోలీసు విధుల్లో బిజీగా ఉండే ఆయన మంగళవారం బైక్పై నుంచి పడిన వ్యక్తిని పరామర్శించి చికిత్స అందిం చారు. మంగపేట మండలం రాజుపేట గ్రామానికి చెందిన వ్యక్తి ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి మీదుగా బైక్ పై వెళ్తుండగా కుక్కలు అడ్డురావడంతో అదుపుతప్పి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ ఆయనను చూసిన ఎస్పీ శబరీష్ తన వాహనం ఆపి బాధితుడి వద్దకు వెళ్లి పరామర్శించారు. ఆయనకు సపర్యలు చేసి ప్రాథమిక చికిత్స అందించారు. సుమారు అరగంటపాటు ఆగిన ఎస్పీ బాధితు ని వివరాలు తెలుసుకొని ప్రాథమికంగా కోలుకున్నాక ఆసు పత్రికి తరలించమని సిబ్బందిని సూచించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, అక్కడే ఉన్న స్థానికులు ఎస్పీకి అభినందనలు తెలిపారు.