కోడ్ భాషా టీచర్లకు ఎస్పి సన్మానం

కోడ్ భాషా టీచర్లకు ఎస్పి సన్మానం

తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: భాష ద్వారా ప్రత్యే కమైన సజ్ఞలతో ఇంటలిజెన్స్ విభాగాలకు ఉపయోగపడే రీతిలో ప్రత్యేకత చాటుకున్న భాష, లిపిని తయారుచేసిన ఉపాధ్యాయులకు పోలీసు యంత్రాంగం ఘనంగా సన్మానిం చింది. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కాటారం మండల కేంద్రంలోని బిఎల్ఎం గార్డెన్స్ లో నిరుద్యోగ యువతీ యువకులకు స్టడీ మెటీరి యల్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే చేతుల మీదుగా ఉపాధ్యాయులను శాలువాతో సత్కరించారు. మహాదేవపూర్ పాఠశాలలో విద్యార్థులకు ఐ కోడింగ్, ఇయర్ కోడింగ్ లో విద్యార్థులకు ప్రత్యేక భాషను , దానికి ప్రత్యేక లిపిని తయారు చేసి శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులు మడక మధు ని ఎస్పీ కిరణ్ ఖరే సన్మానించారు. శిక్షణ పొందిన విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో వారి ప్రతిభా పాటవాలను ప్రదర్శించిన విషయాలను కాటారం డిఎస్పి గడ్డం రామ్మోహన్ రెడ్డి ఎస్పీకి వివరించారు. ఉపాధ్యాయులు మడక మధు, గండు రాజబాబు, బొల్లం సతీష్ తదితరులను ఎస్పీ కిరణ్ ఖరే శాలువాతో సత్కరించారు. పోలీస్ విచార ణలో కోడ్ డీకోడింగ్ లకు ఈ భాష ఎంతగానో ఉపయోగప డుతుందని,దీనిపై ప్రభుత్వ యంత్రాంగానికి సూచన చేయను న్నట్లు ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు.