జాతీయ సేవారత్న అవార్డు గ్రహీత కొట్టే సతీష్ కు సన్మానం
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : కాటారం మండలం గారేపెల్లి కీ చెందిన కొట్టే సతీష్ విదేశాల్లో ఉన్నత చదువులు చదివి తన గ్రామంలో బిజినెస్ స్థాపించి పలువురికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, అలాగే స్వయంకృషి స్వచ్ఛంద సంస్థ ను నిర్వహిస్తున్నాడు. ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా కరోనా కాలం లో మరణించిన వారికీ అంతక్రియలు నిర్వహించడం, గ్రామంలో పేదవారు ఎవరైనా చనిపోతే ఈ సంస్థ ద్వారా వారికి సహాయం చేయడం, పేద పిల్లలు చదువుకోవడంలో సహాయం అందించడం, పదో తరగతి పిల్లలకు ఫైనల్ ఎగ్జామ్స్ సమయంలో పెన్నులు ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో ఫలితాలు సాధించిన అమ్మాయిలకు నగదు పురస్కారం కూడా ఇవ్వడం జరిగింది. స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. వీరి యొక్క సేవలను గుర్తించి జాతీయ స్థాయిలోని బహుజన సాహిత్య అకాడమీ వారు 2024 సంవత్సరానికి జాతీయ సేవా రత్న అవార్డును ప్రధానం చేశారు. ఈ అవార్డు రావడంతో తనపై ఇంకా బాధ్యత పెరిగిందని, రాబోయే కాలంలో కాటారం మండలం లో మరిన్ని సేవలు చేయడానికి స్వయంకృషి స్వచ్ఛంద సంస్థ ముందు ఉంటామని కొట్టే సతీష్ అన్నారు. అనంతరం అవార్డు గ్రహీత కొట్టే సతీష్ కు కాటారం వాసులు శాలువ తో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కడారి విక్రమ్, సింగిరెడ్డి మధుకర్ రెడ్డి, ఆత్మకూరి కుమార్ , సీఆర్పీఎఫ్ జవాన్ మనోహర్, సుమన్, కృష్ణారెడ్డి, శ్రవణ్ పాల్గొన్నారు. సన్మాన కార్యక్రమం అనంతరం వారు సతీష్ కు సీట్లు తినిపించి అభినందనలు తెలిపారు.