సైడ్ డ్రయిన్ దాటి పెట్టిన బడ్డి కోట్లు తొలగించాలి.
సైడ్ డ్రయిన్ దాటి పెట్టిన బడ్డి కోట్లు తొలగించాలి.
– వెంకటాపురం గ్రామపంచాయతీ నోటీసులు.
వెంకటాపురంనూగూరు, తెలంగాణజ్యోతి :ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ప్రధాన మార్కెట్ సెంటర్ ఇరు వైపులా ప్రధాన రహదారి సైడ్ డ్రయిన్ దాటి బడ్డి కోట్లు ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు మూడు రోజుల లోగా తొలగించాలని మేజర్ పంచాయతీ ఆధ్వర్యం లో మంగళవారం నోటీసులు జారీ చేశారు. వెంకటాపురం మేజర్ పంచాయతీ పట్టణ కేంద్రంలో శ్రీ శివాలయం నుండి శ్రీ కనకదుర్గమ్మ దేవాలయం వరకు రోడ్డుకు ఇరువైపుల సుమా రు మూడున్నర కిలోమీటర్ల పొడవునా సైడ్ డ్రయిన్ నిర్మించా రు. అయితే కొంతమంది వ్యాపారులు సైడ్ కాలువ దాటి రోడ్డు సరిహద్దులలో బడ్డీ కొట్లను ఏర్పాటు చేసుకొని, వ్యాపా రాలు నిర్వహిస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదులు రావటంతో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో కాలువ దాటి పెట్టిన బడ్డీ కొట్లు తొలగించేందుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు సైడ్ కాలువ దాటిన దుకాాణాలను అక్కడికక్కడే గుర్తించి, వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసు అందుకున్న మూడు రోజుల్లోగా ఆయా షాపులను తొలగించాలని లేనట్లయితే, గ్రామపంచాయతీ చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా నోటీసులలో పేర్కొన్నారు. కాగా, జగదాంబ థియేటర్ సెంటర్లో ని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు వద్ద సైడ్ డ్రయిన్ దాటి ఒక బడ్డీ కొట్టు లో జిరాక్స్ సెంటర్ ఏర్పాటుచేసిన విషయంపై వివాదం నెలకొన్నది. దీనిపై బడ్డీ కొట్టును తొలగించాలంటూ అధికారులకు పిర్యాదులు వెళ్ళాయి. దీంతో బట్టీ కొట్టును ఖాళీ చేయాలని తొలగించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దుకాణాల తొలగింపు అంశం వెంకటాపురం పట్టణం లో చర్చనీయాంశమైంది.