లారీ డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్ఐ గుర్రం కృష్ణ ప్రసాద్
లారీ డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్ఐ గుర్రం కృష్ణ ప్రసాద్
తెలంగాణజ్యోతి, ఏటూరు నాగారం: మండల కేంద్రంలో ఎస్పీ శబరరీష్ ఆదేశాల మేరకు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ సిబ్బందితో కలిసి 163 జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలను నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడు పుతున్న 66 లారీలకు 75,485 రూపాయలు జరిమానా విధించారు. అదేవిధంగా లారీ డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ నిబంధన లకు విరుద్ధంగా రోడ్లపై లారీలను పార్కింగ్ చేయవద్దని, మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ తో పాటు సిబ్బంది గోపి, సదానందం, శ్రీనివాస్, అజయ్, లక్ష్మణ్ నాయక్ లు పాల్గొన్నారు.