మర్డర్ కేసును చేదించిన పోలీసులు

Written by telangana jyothi

Published on:

మర్డర్ కేసును చేదించిన పోలీసులు

– 72 గంటల్లోనే మర్డర్ కేసు నిందితులు అరెస్ట్

తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : ములుగు జిల్లా తాడ్వాయి మండలం నాంపల్లి గ్రామ శివారు వద్ద మే05 2024 మంగళవారం రోజున జరిగిన అంగన్వాడీ టీచర్ రడం సుజాత పై జరిగిన అత్యాచారం, మర్డర్ కేసులో పోలిసులు నిందితులను అరెస్టు చేశారు. స్థానికంగా సంచలనాత్మకంగా మారిన అంగన్వాడీ టీచర్ సుజాత హత్య కేసును ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు పోలిసులు 72 గంటల్లోనే ఛేదించి నిందితులను అరెస్టు చేశారు. కాగా శుక్రవారం రోజున తాడ్వాయి పోలీసు స్టేషన్ లో పోలీసులు నిందితు లను విలేకరుల సమావేశంలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ములుగు డీఏస్పీ రవీందర్, పస్రా సీఐ వంగపల్లి శంకర్, తాడ్వాయి ఏస్సై ననిగంటి శ్రీకాంత్ రెడ్డి లు మాట్లడుతూ మృతురాలి కొడుకు రడం చరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తాడ్వాయి పోలీసులు విచారణ చేపట్టి పస్రా సీఐ వంగపల్లి శంకర్, తాడ్వాయి ఎస్సె ననిగంటి శ్రీకాంత్ రెడ్డి ల ఆధ్వర్యంలో 2 బృందాలుగా ఏర్పడి సీసీ ఫుటేజీల ఆధా రంగా, వారి కాల్ డేటా ఆధారంగా పూర్తి ఆధారాలు సేకరించి నిందితులను పట్టుకోవడం జరిగిందన్నారు. చిన్నబోయిన పల్లి గ్రామానికి చెందిన రడం సుజాత14 వ తేదిన అంగ న్వాడీలో విధులు ముగించుకొని తిరిగి చిన్నబోయినపల్లి లోని తన ఇంటికి వెళ్లడం కోసం బస్ స్టాండ్ కి రాగా బస్ మిస్ అవడంతో అంతకుముందే పరిచయం ఉన్న ఆకుదారి రామయ్య సుజాతను కాటాపూర్ నుండి లిఫ్ట్ ఇవ్వడం కోసం బైక్ ఎక్కించుకున్నాడని, అప్పటికే ఆకుదారి రామయ్య నాంపల్లి గ్రామా శివారులోని నీళ్ల ఒర్రె వద్ద పగిడి జంపయ్యని దించడం జరిగిందని తర్వాత ఆకుదారి రామయ్య నీళ్ల ఒర్రె వద్దకు మృతురాలిని తీసుకెళ్లి అక్కడ ఆకుదారి రామయ్య, పగిడి జంపయ్య ఇద్దరూ ఆమెను అడవిలో కొద్దీ దూరం తీసుకెళ్లి హత్యచారం చేసి ఆమె మెడలోని బంగారు గోపి తాడును లాక్కునే ప్రయత్నం చేశారు. ఆమె ప్రతి ఘటించడంతో పగిడి జంపయ్య ఆమె తలపై రాయితో కొట్టి ఆమె స్కార్ఫ్ తో మెడకు చుట్టి హత్య చేసి మృతురాలు సుజాత మెడలోంచి 3 తులాల బంగారు గోలుసు తీసుకుని మృతురాలి హ్యండ్ బ్యాగ్ను, మొబైల్ ఫోన్ ను అడవిలో దూరంగా పడవేసి తిరిగి వారి గ్రామం అయిన రొయ్యూర్కు వెళ్లిపోయారిన పోలిసులు తెలిపారు.కాగా శుక్రవారం 17 న ఉదయం కాటాపూర్ క్రాస్ వద్ద పసర సర్కిల్ సీఐ శంకర్, తాడ్వాయి ఏస్సె శ్రీకాంత్ రెడ్డి, సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేస్తుండగా మోటార్ సైకిల్ పై తాడ్వాయి వైపు నుండి వస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు పోలిసులను చూసి పారిపోతుండగా పట్టుకొవడం జరిగింది తెలిపారు. కాగా నిందితులు రొయ్యూర్ గ్రామానికి చెందిన ఆకుదారి రామయ్య(45) తండ్రి పోశాలు, పగిడి జంపయ్య (42) తండ్రి, ఎర్ర సమ్యయ్య గా గుర్తించామని నిందితుల వద్ద నుండి 1)మోటార్ సైకిల్ హీరో గ్లామర్ TS16EK3264, 2) మూడు తులాల రెండు వరుసల గోపి తాడు, పుస్తెలు 3)హాండ్ బ్యాగ్, అందులో ఉన్న మృతురాలి బ్యాంక్ పాస్ బుక్స్, ఆధార్ కార్డ్ ను స్వాధీన పరుచుకున్నామని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ములుగు డీ ఏస్పీ రవీందర్ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాక చక్యంగా వ్యవహరించిన పస్రా సీఐ శంకర్, తాడ్వాయి ఏస్సె శ్రీకాంత్ రెడ్డి, ఏఏస్సె చింతనారాయణ, హెచ్ సీ కిషన్, పీసిఏస్ పూజారి రమేష్, జాజా సాంబయ్య, అప్పాల రమేష్, గోపు రాజీవ్, కాసగోని రాజేష్ లను పోలీసు ఉన్నాతా ధికారులు అభింనందిచారు.

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now