ఇసుక జీరో దందా అరికట్టడానికి చెక్ పోస్ట్ ఏర్పాటు చేయండి
ఇసుక జీరో దందా అరికట్టడానికి చెక్ పోస్ట్ ఏర్పాటు చేయండి
– జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేసిన అజ్మీరా పూల్ సింగ్ నాయక్.
తెలంగాణ జ్యోతి, మహా ముత్తారం: జిల్లాలోని మహదేవ పూర్, పల్మెల మండలాల్లో టీఎస్ఎండీసీ ద్వారా నిర్వహి స్తున్న ఇసుక రీచుల్లో జరుగుతున్న అక్రమాలను కట్టడి చేయుట కోసం చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అజ్మీరా పూల్ సింగ్ నాయక్ వినతిపత్రం అందజేశారు. ఆయా ఇసుక రీచుల ద్వారా వే బిల్లుల రీ సైక్లింగ్ చేస్తూ ప్రభుత్వ ఆదాయా నికి గండి పడుతోందని. అలాగే రీచులకు సంబంధించిన స్టాకు యార్డుల నుండి ఇసుక పెద్ద ఎత్తున తరలిస్తున్న క్రమంలో జిరో దందా కూడా సాగుతోందనీ పూల్ సింగ్ నాయక్ పేర్కొన్నారు. అక్రమంగా స్టాకు యార్డులను ఏర్పాటు చేసుకుని జీరో దందా సాగిస్తుండడం వల్ల ప్రభుత్వ ఆదాయా నికి గండి పడుతున్నందున వాటిని కట్టడి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, గతంలో ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి కొంతకాలానికి వాటిని తొలగించినారాని. దీంతో ఇసుక అక్రమ రవాణా తీవ్రంగా పెరిపోయింది. ఈ ప్రాంతం మీదుగా వెల్తున్న ఇసుక అక్రమ రవానా, వే బిల్లుల రీ సైక్లింగ్ వ్యవహారాలను కట్టడి చేసేందుకు రుద్రారం క్రాస్ రెడ్ సమీపంలో, సోమన్ పల్లి బ్రిడ్జి వద్ద మరోకటి చెక్ పోస్టులను ఏర్పాటు చేయించాలని కోరారు.ఇట్టి చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి తమరి కార్యాలయం నుండి పర్యవేక్షించిన ట్టయితే అన్ని అక్రమాలకు తావు ఉండకపోయే అవకాశం ఉంటుందనీ. ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిం చేందుకు ప్రత్యేక చొరవ చూపించగలరని అయన జిల్లా కలెక్టర్ జిల్లాను కోరారు.