దేవాదాయశాఖ అధికారులతో సమీక్షా సమావేశం

Written by telangana jyothi

Published on:

దేవాదాయశాఖ అధికారులతో సమీక్షా సమావేశం

– ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

తెలంగాణ జ్యోతి, భూపాలపల్లి జిల్లా ప్రతినిధి: భూపాల పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఎండో మెంట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో దేవాదాయ శాఖ వరంగల్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రావు, అసిస్టెంట్ కమిషనర్ సునీత, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్ రావు, ఏఈ దుర్గాప్రసాద్, భూపాలపల్లి డివిజన్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.ఈసందర్భంగా సమీక్షలో అధికారులతో నియోజ కవర్గంలోని పలు దేవాలయాలపైన ఎమ్మెల్యే గండ్ర సత్యనా రాయణ రావు చర్చ జరిపారు. ముఖ్యంగా రేగొండ మండలం లోని కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయ అభివృద్ది, చిట్యాల మండలంలోని నైన్ పాక గ్రామంలోని నాపాక ఆలయ అభివృద్ధితో పాటు పలు దేవాలయాల అభివృద్ధికి సంబంధించి చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నదని, అందుకు అధికారులు బాధ్యతతో పనిచేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులకు సూచించారు.

Leave a comment