పెసా గ్రామ సభల ద్వారానే ఆరు గ్యారంటీల ఎంపిక జరగాలి
పెసా గ్రామ సభల ద్వారానే ఆరు గ్యారంటీల ఎంపిక జరగాలి
– ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,న్యాయ వాది వాసం నాగరాజు
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది, డిసెంబర్27 : ఐదవ షెడ్యూల్డ్ ప్రాంతం లో పెసా గ్రామ సభల ద్వారానే అభివృద్ధి జరగాలని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, న్యాయవాది వాసం నాగరాజు అన్నారు. ములు గు జిల్లా వెంకటాపురం మండలం చిరుతపల్లిలో బుధవారం ఏఎన్ ఎస్ సమావేశం నిర్వహించారు. ఏజెన్నీ షెడ్యూల్ ప్రాంతంలో ప్రభు త్వం చేపట్టే ఆరు గ్యారంటీల విషయం లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పెసా గ్రామ సభల ద్వారానే జరగాలని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ అధికారుల పెసా చట్టం పైన సంపూర్ణ అవగాహన కలిగి వుండలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటీల పథకాలు ఏజెన్సీ చట్టాలకు విరుద్దం గా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఏజెన్సీ ప్రాంతాలలో ప్రభుత్వ పరిపాలన రాజ్యాంగ బద్దంగా జరగడం లేదని ఆరోపించారు.రాష్ట్ర ప్రభుత్వం రూపొందిచించే సంక్షేమ పథకాలు ఏజెన్సీ ప్రాంత చట్టా లకు లోబడి ఉండాలన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండ లం నుండి గతంలో గిరిజనేతరుడు ఇంటి పన్ను ఇవ్వాలని హై కోర్ట్ ను ఆశ్రయించగా అప్పటి హై కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తి షెడ్యూల్డ్ ప్రాంతంలో గిరిజనేతరులకు ఇంటి పన్నులు ఇవ్వరాదని వ్యాఖ్యా నించినట్లు గుర్తు చేసారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన గృహ లక్ష్మి పథకం ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘించే విధంగా ఉందని న్యాయ స్థానం నిలుపుదల చేసినట్టు ఆయన తెలియజేశారు. షెడ్యూల్డ్ ప్రాంతంలో పంచాయితీ అధికారులు సాధారణ గ్రామ సభలను నిర్వహించడం రాజ్యాంగ విరుద్దమని పేర్కొన్నారు. కెసిఆర్ ప్రభు త్వం ఏజెన్సీ చట్టాలను నిర్వీర్యం చేసినట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయాలని చూడటం దుర్మార్గమైన చర్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే ప్రతి సంక్షేమ పథకం పైన గిరిజన సలహా మండలిలో ముందుగా చర్చ జరగాలని తెలిపారు. గిరిజన సలహా మండలి ఆదేశాల ప్రకారమే గిరిజన ప్రాంతాల్లో సంక్షేమ పథకాలు అమలు చేయాలని అన్నారు. గిరిజన సలహా మండలిని సత్వరమే ఏర్పాటు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో ఆదివాసి నేతలు అట్టం లక్ష్మయ్య, శివ, నారాయణ తదితరులు పాల్గొన్నారు.