ప్రజాపాలన గ్రామసభలను కట్టుదిట్టంగా నిర్వహించాలి
– ప్రతి రోజు రెండు షిఫ్టులలో ప్రజాపాలన గ్రామసభల నిర్వహణ.
– అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ పి. శ్రీజ.
ములుగు, డిసెంబర్27, తెలంగాణ జ్యోతి : జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కట్టుదిట్టంగా ప్రజాపాలన సభలు నిర్వహించి ప్రజల నుంచి మహాలక్ష్మీ, రైతు భరోసా, ఇందిర మ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించిన దర ఖాస్తులు పకడ్బందీగా స్వీకరించాలని అదనపు కలెక్టర్ లోకల్ బాడీ స్ పి. శ్రీజ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరం లో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ పి. శ్రీజ, అదనపు కలెక్టర్ రెవె న్యూ డి. వేణు గోపాల్, ఆర్ డి ఓ కే. సత్య పాల్ రెడ్డి లతో కలిసి ప్రజాపాలన గ్రామసభల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ పి. శ్రీజ మాట్లాడుతూ, ప్రజలకు చేరువగా పాలన అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమా నికి శ్రీకారం చుట్టిందని , డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు పని దినాలలో జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ, గ్రామ సభ నిర్వహిం చి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అదనపు కలెక్టర్ తెలిపారు.ప్రతి మండలం పరిధిలో మండల ప్రత్యేక అధికారి, తహసిల్దార్, ఎంపీడీవో, ఎంపీ ఓ ఆధ్వర్యంలో నాలుగు బృందాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతిరోజు ప్రతి బృందం ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షెడ్యూల్లో గ్రామసభ నిర్వహించి ప్రజలనుంచి మహాలక్ష్మి , రైతు భరోసా, చేయూత, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు మొదలగు పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ప్రజాపాలన సభలలో పాల్గొనే సిబ్బంది సమయపాలన పాటించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ప్రతి గ్రామానికి దరఖాస్తులు ఒకరోజు ముందుగానే వస్తాయని, గ్రామ ప్రజలకు ముందుగానే దరఖాస్తులు అందించాలని, దరఖాస్తుదారు లు ముందుగానే దరఖాస్తు నింపుకొని గ్రామ సభకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, గ్రామంలోని నిరక్షరాస్యులకు పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు దరఖాస్తు నింపడంలో సహకరించేలా చూడాలని అన్నారు. గ్రామసభల నిర్వహణకు సంబంధించిన షెడ్యూలు అందించడం జరుగుతుం దని, మహాలక్ష్మి , రైతు భరోసా, చేయూత, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు మొదలగు పథకాలకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించాలని, దరఖాస్తుదారులు ముందస్తుగా దరఖాస్తు ఫారం నింపుకొని గ్రామ సభకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, గ్రామసభ నిర్వహణపై డప్పు చాటింపు ద్వారా ప్రచారం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.ప్రజా పాలన సభ నిర్వహ ణకు అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించా లని త్రాగునీ రు, కుర్చీలు, అవసరమైన బల్లలు ఏర్పాటు చేయాలని, ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని, ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు స్వీకరించాలని, ఆధార్, రేషన్ కార్డు జత చేసేలా చూడాలని అన్నారు. గ్రామసభలలో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద క్యూలైన్ విధానం పాటించేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన మేర పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రభు త్వం నుంచి సరఫరా చేసిన దరఖాస్తు ఫారంలు మండలాలకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు ప్రజాపాలన సభలలో తీసుకునే దరఖాస్తులను ఎప్పటికప్పుడు కంప్యూటర్లో నమోదు చేయాలని,దరఖాస్తుదారునికి రసీదు అందించాలని, ప్రజా పాలన సభ నిర్వహణకు స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించా లని, వారిని భాగస్వామ్యం చేయాలని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో డిపిఓ వెంకయ్య, మండల ప్రత్యేక అధికారులు, తహశీదార్లు, ఎంపీడీవోలు, ఎంపీ ఓలు తదితరులు పాల్గొన్నారు.
1 thought on “ప్రజాపాలన గ్రామసభలను కట్టుదిట్టంగా నిర్వహించాలి”