Sarpanch elections | డిసెంబర్ లో తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు..!
Sarpanch elections | డిసెంబర్ లో తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు..!
డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మరో ఎన్నికలు జరగ బోతున్నాయి. అవే సర్పంచ్ ఎన్నికలు. పంచాయతీలకు ఎన్ని కలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2024, డిసెం బర్ నెలలోనే సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసులరెడ్డి స్పష్టం చేశారు. 2025 జనవరి నెలలో గ్రామాలకు కొత్త సర్పంచ్ లు వస్తారని మీడి యా చిట్ చాట్ లో వెల్లడించారాయన. 2024, ఫిబ్రవరి నెల తోనే సర్పంచ్ ల పదవీ కాలం ముగిసింది. ప్రభుత్వం ఇంచా ర్జీల పాలన నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వా త.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి సర్పంచ్ ఎన్నికలు ఇవే కావటం విశేషం. దీంతో ఈ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. సర్పంచ్ ఎన్నికలకు ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ.. భారీ సంఖ్యలో తన అనుకూల వ్యక్తులను గెలిపించుకునే వ్యూహంలో ఉంది.