పారిశుద్ధ్య చర్యలు ముమ్మరంగా చేపట్టాలి
పారిశుద్ధ్య చర్యలు ముమ్మరంగా చేపట్టాలి
– గ్రామాల్లో ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగాలి
– కాటారం డివిజన్ పంచాయతీ అధికారుల ప్రత్యేక సమావేశం
– భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: గ్రామాల అభివృద్ధి లో గ్రామ పంచాయతి ప్రత్యేక అధికారుల విధులు, బాధ్యత లు చాలా ముఖ్యమైనవని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపా రు. బుధవారం కాటారం మండల పరిషత్ కార్యాలయంలో కాటారం డివిజన్ గ్రామ పంచాయతి ప్రత్యేక అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామా ల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరాయంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాకాలం ముగిసినం దున పారిశుధ్య కార్యక్రమాలు చాలా ముఖ్యమని మండల ప్రత్యేక అధికారులు గ్రామాల్లో వారంలో రెండు రోజులు తని ఖీలు చేస్తూ పర్యవేక్షణ చేయాలని తెలిపారు. గ్రామ పంచా యతీ సిబ్బంది విధులను పర్యవేక్షణ చేయటం చాలా ముఖ్య మని తెలిపారు. ప్రత్యేక అధికారులు పర్యటనలో గుర్తించిన అంశాలను పరిశీలించడానికి చర్యలు చేపట్టాలని తెలిపారు. పాఠశాలలు, సబ్ సెంటర్స్, రెసిడెన్సియల్ హాస్టల్స్, గ్రామపం చాయతీ భవనాలు, ప్లాంటేషన్ కంపోస్ట్ షెడ్డు, వైకుంఠ ధామా లు తనిఖీ చేయాలని, తనిఖీ ఫోటోలను గ్రూపులో పోస్ట్ చేయాలని తెలిపారు. మన గ్రామపంచాయతీ క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలని అదే మన గోల్ అని తెలిపారు. వ్యాధులు ప్రబ లే అవకాశం ఉన్నందున పారిశుధ్య కార్యక్రమాలను ముమ్మ రంగా చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేయటం వల్ల గ్రామాలు స్వచ్ఛతను సంతరించుకుని వ్యాధులు దరిచేరని సమా జం ఏర్పడుతుందని అన్నారు.గ్రామాలు స్వచ్చతకు జరుగుతున్న స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచిం చారు. రహదారులు వెంబటి వ్యర్దాలు తొలగించాలని అక్కడ మొక్క లు నాటి పచ్చదనం పెంపొందించే చర్యలు చేపట్టాలని తెలి పారు. గ్రామపంచాయతీ అధికారులు పర్యవేక్షణ చేయ డం లేదని అపవాదులు రావొద్దని ఆయన పేర్కొన్నారు. ప్రజల సంక్షేమంలో మీరు భాగస్వాములుగా ఉన్నారని, పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మీ అధికారాలను, విధులను వినియోగించుకోవాలని ఆయన తెలిపారు.ఆరు బయట వ్యర్ధాలు కాల్చితే చర్యలు తీసుకో వాలని, కాల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తాయని తద్వారా పర్యావరణం దెబ్బతింటుందని తెలిపారు. వ్యర్దాలు కాల్చితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారం 25 వేల వరకు జరిమానా విధించడానికి అవకాశం ఉందని తెలిపారు. భగీరథ నీటి సరఫరా పర్యవేక్షణ చేయాలన్నారు. మంచినీటి సమస్య ఏర్పడితే తన దృష్టి తీసుకురావాలని సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. వేసవిలో చేపట్టిన చర్యల వల్ల గ్రామాల్లో సమస్యలు రాకుం డా చేశామని, భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తే తక్షణం పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ యొక్క సమావేశం ముఖ్య విధి గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆయన పేర్కొన్నా రు. విధులు అధికారాలు గురించి చట్టం గురించి తెలుసు కోవాలని గ్రామ పంచాయితీలో పర్యటించడం వలన గ్రామా లు స్వచ్ఛతను సంతరించుకుంటాయని పేర్కొన్నారు. ప్రతి వారంలో రెండు లేదా మూడుసార్లు తప్పనిసరిగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. శిక్షణ కార్య క్రమంలో విదులు అధికారాలపై సమగ్రమైన, స్పష్టమైన అవ గాహన పెంపొందించుకోవాలని ఆయన పేర్కొన్నారు. గ్రామా ల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ఆయన పేర్కొ న్నారు. వ్యాపార, మాంసాహార వ్యాపారులతో సమావేశాలు నిర్వహిం చి ప్లాస్టిక్ వినియోగం తగ్గించే విధంగా అవగాహన కల్పించా లని అన్నారు.అమ్మపేరున మొక్కలు నాటేలా చర్యలు చేపట్టాలన్నారు. వనరుల ద్వారా ఆదాయం సమకూరే లా ప్రణాళికలు తయారు చేయాలని తెలిపారు.అనంతరం గ్రామ పంచాయతి కార్మికులను శాలువాతో సత్కరించి సేవలను అభినందించారు. అనంతరం స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం పై ప్రతిజ్ఞ చేపించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కలెక్టర్ విజయలక్ష్మి, డిపిఓ నారాయణరావు, మండల ప్రత్యేక అధికారి సంజీవరావు, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికా రులు తదితరులు పాల్గొన్నారు.