జాతీయ స్థాయి ఖో ఖో కు ఎన్నికైన విద్యార్థులు
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : మండలంలోని చిన్న బోయినపల్లి ఆశ్రమ పాఠశాలకుచెందిన విద్యార్థులు జాతీయ స్థాయి ఖోఖో క్రీడకు ఎంపికయ్యారు. ఈ నెల 13,14,15 తేది లలో మౌలాలిలో జరిగిన రాష్టస్థాయి సబ్ జూనియర్ ఖోఖో లో 7వ తరగతి మాసయ్య, 8వ తరగతి రవి లు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి కి ఎంపికయ్యారని పిఈటీ వటం వెంకటేష్ తెలిపారు. జాతీయ స్థాయికి ఎంపికైన విద్యా ర్థులను హెడ్మాస్టర్ నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యా ర్థులు అభినందించారు.