దర్మవరంలో రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవాలు.
దర్మవరంలో రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవాలు.
– గ్రామ ప్రజలకు అవగాహన కల్పించిన పేరూరు ఎస్సై రమేష్.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగురు వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని వాజేడు మండలం ధర్మారంలో బుధవారం సాయంత్రం పేరూరు పోలీసు ఎస్సై జి .రమేష్ గ్రామస్తులకు రోడ్డు ప్రయాణ భద్రతా అంశాలపై అవగాహన కల్పించారు. రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాసోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పోలీస్ శాఖ చేపట్టి, రోడ్డు ప్రమాదాల నివారణకు గ్రామ ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని పోలీస్ శాఖ చేపట్టింది. ఇందులో భాగంగా ధర్మారం గ్రామంలో పేరూరు పోలీస్ మరియు సిఆర్పీఫ్ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. గ్రామ ప్రజలకు రోడ్ భద్రతా నియమాలు , మద్యం తాగి వాహనాలు నడపడం, లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, మైనర్ ల డ్రైవింగ్, ట్రిబుల్ రైడింగ్, స్పీడ్ డ్రైవింగ్, రోడ్ పై స్టంట్స్ చేయడం , అతివేగం, పరిమితికి మించి ఆటో లో ప్రయాణం చేయడము, వలన కలిగే పరిణామాలు మరియు డ్రైవింగ్ లో పాటించవలసిన మెళుకువలు , నిబంధనలు ప్రజలకు కూలంకషంగా గ్రామస్తులు కు ఎస్.ఐ.రమేష్ వివరించారు.