Liquor | గుడుంబా పట్టివేత కేసులు నమోదు. 

Liquor | గుడుంబా పట్టివేత కేసులు నమోదు. 

వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు పి.ఎస్.పరిదిలో ఉన్నత అధికారుల ఆదేశం మేరకు పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పిఎస్ స్టాఫ్, సిఆర్పిఎఫ్ పార్టీ కలిసి కృష్ణాపురంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా గుడుంబా పట్టు బడింది. మల్లచారి పెండతోట, అను వ్యక్తి సుమారుగా 40 లీటర్ల గుడుంబాని చతిస్గడ్ రాష్ట్రంలో కొనుగోలు చేసి తీసుకొని తన ద్వచక్రవాహనం పైన వస్తుండగా పట్టుకొని గుడుంబాను బైకును సీజ్ చేసారు. ఆ వ్యక్తి పై కేసు నమోదు చేసి, మళ్లీ గుడుంబా అమ్మకుండా వాజేడు ఎమ్మార్వో ముందు లక్ష రూ. పూచికత్తుతో బైండోవర్ చేశారు. తిరిగి మళ్ళీ గుడుంబా అమ్మినచో లక్ష రూ. జప్తు చేయడం జరుగుతుందని పేరూరు ఎస్.ఐ.జి.రమేష్ తెలిపారు. పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎవరైనా ప్రభుత్వం నిషేధించిన గుడుంబాని అమ్మినచో వారి పైన కఠినమైన చర్యలు తీసుకొడం జరుగుతుందని ఈసందర్భంగా పేరూరు  ఎస్.ఐ హెచ్చరించారు.

Liquor | గుడుంబా పట్టివేత కేసులు నమోదు.