Mavoist | ఆరుగురు మావోయిస్టు మలేషియా సభ్యుల అరెస్టు.

Written by telangana jyothi

Published on:

Mavoist | ఆరుగురు మావోయిస్టు మలేషియా సభ్యుల అరెస్టు.

  • పేలుడు పదార్థాలు, వైర్లు,డిటనోటర్లు, కరపత్రాలు స్వాధీనం.

వెంకటాపురం నూగూరు, తెలంగాణజ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ప్రధాన రహదారిపై వెంకటాపురం పోలీసులు వాహనాలు తణికీలు చేస్తుండగా ఆరుగురు వ్యక్తులు సంచులతో నడిచి వస్తూ పోలీసులను చూసి పారిపోతుండగా అనుమానంతో వారిని పట్టుకుని సోదా చేయగా వారి సంచుల్లో జెలిటిన్ స్టిక్స్,ఎన్నికల బహిష్కరణ కరపత్రాలు, ఇతర పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. ఈ మేరకు నూగూరు వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్ శుక్రవారం వెంకటాపురం పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించి, మిలిషీయా సభ్యుల అరెస్టు వివరాలను వెల్లడించారు. చత్తీస్గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా, హోసూర్ బ్లాక్ ఉట్లపల్లి గ్రామానికి చెందిన తాటి అర్జున్, సోడి వీరయ్య, సోడి గోపి, సోడి రామయ్య, తాటి రమేష్, సోడి నగేష్ అనే ఆరుగురు వ్యక్తులు మిలీషియా సభ్యులుగా నిషేదిత మావోయిస్టు లకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ వారు చెప్పిన విధంగా నడుచుకుంటు న్నారని తెలిపారు. ప్రస్తుతం పట్టుబడిన మావోయిస్టు సభ్యులు లలో నలుగురు గతంలో అరెస్టై జైలు శిక్ష అనుభవించి విడుదలై తిరిగి అదే బాటలో మావోయిస్టు లకు సహాయసహకారాలు అందిస్తున్నా రని సి.ఐ. పేర్కొన్నారు. వీరందరు అడవులలోకి కూంబింగ్ లకు వెళ్లే పోలీసులను హతమార్చేందుకు, మందు పాతరలు , ఇతర విధ్వంసకర చర్యలకు పాల్పడే సామాగ్రిని, ప్రభుత్వ నిషేధిత మావోయిస్టు అగ్ర నాయకులకు అందించేందుకు తీసుకు వెళ్తుండగా పోలీసులు వారిని అరెస్ట్ చేసినట్లు, సీ.ఐ .కుమార్ మీడియాకు వివరించారు. ప్రజలు నిషేధిత మావోయిస్టులు రెచ్చగొట్టే విధానాలను నమ్మవద్దని, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ ఎల్లవేళలా ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో ప్రజలకు రక్షణ, భద్రతా చర్యలతో విదులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జరగనున్న ఎన్నికలు ప్రశాంత వాతావరణం లో నిర్వహించేందుకు, ఎల్లవేళలా పోలీస్ శాఖ కృషి చేస్తుందని, గ్రామాల్లోకి వచ్చే అపరిచిత వ్యక్తుల పట్ల, అసాంఘిక శక్తుల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని, ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్ క్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్, వెంకటాపురం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్. అశోక్, స్పెషల్ పార్టీ సబ్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now