రాజీవ్ యువవికాస్ పథకానికి 2వ రోజు ఇంటర్వ్యూలు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో 18 గ్రామపంచాయతీ నుండి రాజీవ్ యువవికాస్ పదకం కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఇంటర్వూలు నిర్వహించారు. సోమవారం తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో అభ్యర్థులకు ముఖాముఖి ఇంటర్వ్యూల ను నిర్వహించగా, మంగళవారం రెండో రోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ వెంకటాపురం బ్రాంచ్ల అధికారుల ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. మండ లంలో సుమారు 1,900 మందికి పైగా రాజీవ్ యువ వికాస్ పథకానికి ధరఖాస్తులు చేసుకోగా వారి ఒరిజినల్ పత్రాలను బ్యాంక్ అధికారులు పరిశీలించినట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేంద్రప్రసాద్ మీడియాకు తెలిపారు.