సింగరేణి సిఎండి కి ఛాయాచిత్రం బహుకరణ
సింగరేణి సిఎండి కి ఛాయాచిత్రం బహుకరణ
కాటారం ప్రతినిధి, తెలంగాణ జ్యోతి: సింగరేణి సిఎండి బలరాం నాయక్ కు ఆయన చిత్రపటాన్ని బహుకరించి వీరాభిమానాన్ని ప్రదర్శించారు. సింగరేణి కాలరీస్ సిఎండి బలరాం నాయక్ ని బుధవారం హైదరాబాద్ లోని సింగరేణి భవన్ లో రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో కన్వీనర్ కలవేన శ్రీకాంత్ ముదిరాజ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బలరాం నాయక్ ను శాలువా తో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన ఛాయాచిత్రాన్ని గిఫ్ట్ గా బలరాం నాయక్ కు రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో కన్వీనర్ కలవేన శ్రీకాంత్ ముదిరాజ్ అందజేశారు. రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో కన్వీనర్ కలవేన శ్రీకాంత్ ముదిరాజ్ తయారు చేసిన అందమైన బహుకరుణ కు సింగరేణి సిఎండి బలరాం నాయక్ మురిసిపోయారు. ఫోటో చాలా బాగుందని అందించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు పుల్లెల కొమరయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజేష్, కొట్టే రమేష్ ఉన్నారు.