అటవీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి
అటవీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి
– భారీనష్టం అంచనావేసి నివేదికలు ఇవ్వండి
– తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పొదెం వీరయ్య
– తాడ్వాయి అడవుల్లో పర్యటన
– ధ్వంసమైన వృక్షాల పరిశీలన
ములుగు ప్రతినిధి : ములుగు జిల్లాలోని అటవీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఇటీవల భారీ గాలుల విధ్వం సానికి నేలకూలిన వృక్షాల నష్టం అంచనావేసి నివేదకలు అందించాలని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య అధికారు లకు సూచించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ప్రకృతి వైపరీత్యంతో ములుగు జిల్లాలో సుమారు 500ఎకరాల్లో అటవీ వృక్షాలు ధ్వంసం కాగా బుధవారం తాడ్వాయి అడవు లను పొదెం వీరయ్య ములుగు జిల్లా అటవీశాఖ అధికారు లతో కలిసి పరిశీలించారు. ములుగు గట్టమ్మను దర్శించు కున్న వీరయ్యకు అటవీ అధికారులు స్వాగతం పలుకగా తాడ్వాయిలో అదనపు కలెక్టర్, పీసీసీఎఫ్, డీఎప్వో, ఎఫ్డీవో తదితర అధికారులు, కాంగ్రెస్ నాయకులు వెల్కం చెప్పారు. ఈ సంరద్భంగా కాలినడకన విధ్వంసం అయిన ప్రాంతాన్ని పరిశీలించారు. డీఎఫ్వో రాహుల్ కిషన్ జాదవ్ ఎగ్జిబిట్ల ద్వారా వివరించారు. ఈ సందర్భంగా అటవీ అభివృద్ధి శాఖ కార్పొరేషన్ అధికారులు, స్థానిక ఫారెస్ట్ అధికారులతో అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య సమావేశం అయ్యారు. అటవీ అభివృద్ధికి కావలసిన ప్రణాళికలు సిద్ధం చేయాలని, నష్టంపై అంచనా వేసి నివేదికలు పంపించాలని తెలిపారు. అటవీ సంరక్షణ ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని, వృక్షాలను మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ ప్రభాకర్, డీఎఫ్వో రాహుల్ కిషన్ జాదవ్, అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) సంపత్ రావు, డీఎం మాధవి, అటవీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.