ప్రతి గీత కార్మికుడు తాడి సేఫ్టీమోకులను కలిగి ఉండాలి
-ములుగు జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి
వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి: ప్రతి గీత కార్మికుడు తాడి సేఫ్టీమోకులను కలిగి ఉండాలని ములుగు జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి, లక్ష్మీదేవి పేట గీత కార్మిక సంఘం అధ్యక్షులు గట్టు శంకర్ అన్నారు. బుధవారం వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవి పేట గ్రామంలో తాడి సేఫ్టీమోకుల గురించి అవగాహన శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి,గట్టు శంకర్ మాట్లాడారు. నూతనంగా తాడిచెట్లు ఎక్కుతున్న కల్లు గీత కార్మికులకు పాత గీత కార్మికులకు తప్పనిసరిగా సేఫ్టీ మోకులు అవసరమని అన్నారు. ఈ సేఫ్టీ మొకుల ద్వారా ప్రతి కుటుంబానికి నమ్మ కం ధైర్యం ఉంటుందని అన్నారు. గీత కార్మికులకు సభ్యత్వం అతి ముఖ్యమైనదని అన్నారు .సభ్యత్వం గుర్తింపు కార్డు ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. తాటి చెట్టు ఎక్కే ప్రతి గీత కార్మికుడు తప్పనిసరిగా గుర్తింపు కార్డు సభ్యత్వం కలిగి ఉండాలని అన్నారు. గీత కార్మిక జిల్లా ప్రధాన కార్యదర్శి గుండబోయిన రవి, జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ మాట్లాడుతూ కల్లుగీత వృత్తి ప్రమాదకరమైనదని చాలా జాగ్రత్తగా ఉండాలని వారు అన్నారు.తాటి చెట్టు ఎక్కు తున్న క్రమంలో సెల్ఫోన్లు వాడవద్దని పేర్కొన్నారు. గీత కార్మికులు విధిగా గుర్తింపు కార్డు కలిగి ఉండి సభ్యత్వం గుర్తింపు కార్డు కలిగి ఉండి ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలు అందుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ ఇచ్చినవారు కే రాజా , పొన్నం వెంకటేష్, జాగిరి అంజన కుమార్, గుర్రం శ్రీనివాస్, వెంగళ తిరుపతి, లక్ష్మీదేవి పేట, పాలంపేట నల్ల గుంట, రామంజపూర్ గ్రామాలకు చెందిన గీత కార్మికులు గట్టు కుమార్ స్వామి, పెరమండ్ల పున్నం, రాపర్తి రమేష్, చిర హరీష్, చిర్ర వీరస్వామి, తల పెళ్లి కుమార స్వామి, చిర్రా గణేష్, బుర్ర సదానందం, తడక సారయ్య తదితరులు పాల్గొన్నారు.