ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణలో వృద్ధులకు, వికలాంగులకు, నిరక్షరాక్షులకు ప్రాధాన్యత ఇవ్వాలి.

ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణలో వృద్ధులకు, వికలాంగులకు, నిరక్షరాక్షులకు ప్రాధాన్యత ఇవ్వాలి.

– ములుగు అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్.    

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి :  ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలను ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ గురువారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ వృద్ధులకు, వికలాంగులకు, నిరక్షరాశులకు ప్రత్యేక కౌంటర్లలలో దరఖాస్తులను పూర్తి చేసి సహాయ సహకారాలు అందించాలని, సంబంధిత కౌంటర్ల వద్దకు వెళ్లి పరిశీలించారు. అలాగే ప్రతి ఒక్కరి దగ్గర నుండి దరఖాస్తులను స్వీకరించాలని, దరఖాస్తుదారులకు రషీదు అందజేయాలని అదికారులు ను ఆదేశించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగూరు, బి.సి మరి గూడెం పంచాయతీ లో ప్రజా పాలన అభయ హస్తం దరఖాస్తులు స్వీకరణ కేంద్రాలను ఆయన పరిశీలించిచారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ లో క్యూలు పెరగకుండా దరఖాస్తులు స్వీకరించాలని కోరారు. డిసెంబర్ 31 జనవరి ఒకటో తేదీ ,లు రెండు రోజులు ప్రభుత్వ సెలవులు ఉన్నాయన్నారు. అలాగే గ్రామాల్లో లేని కుటుంబాల వారి వద్ద నుండి ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని స్వీకరించే విధంగా తదుపరి ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే వాజేడు మండలంలో కూడా అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కేంధ్రాలను పరిలించారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం మండల తాసిల్దార్ సమ్మయ్య, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ. బాబు, మండల పంచాయతీ అధికారి హనుమంతరావు ,మండల వ్యవసాయ అధికారి జి. నరసింహారావు ఆయా పంచాయతీల కార్యదర్శులు తోపాటు, నూగూరు , వెంకటాపురం సర్పంచులు ఇండ్ల లలిత, సత్యావతి టీం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.