ప్రజాపాలన గ్రామసభలను కట్టుదిట్టంగా నిర్వహించాలి
– జిల్లా ఎస్ పి గౌష్ ఆలం ఐ పి ఎస్
ములుగు, డిసెంబర్28, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా లో గల ప్రజాపాలన సెంటర్స్ ను నేరుగా సందర్శించి కార్యక్రమ ఏర్పాట్లను ఎస్ పి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్ పి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా లో గల అన్ని గ్రామ పంచాయితీలలో కట్టుదిట్టంగా ప్రజాపాలన సభలు నిర్వహించి ప్రజల నుంచి మహాలక్ష్మీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించేలా పకడ్బందీగా భద్రతా చర్యలు చేపట్టామని, అర్హులైన ప్రజలు స్వేచ్ఛగా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసు కోవాలని కోరారు.
1 thought on “ప్రజాపాలన గ్రామసభలను కట్టుదిట్టంగా నిర్వహించాలి”