చేతికి అందేఎత్తులో విద్యుత్ తీగలు.

చేతికి అందేఎత్తులో విద్యుత్ తీగలు.

– ఒరిగిన విద్యుత్ స్తంభాలు. 

– పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు. 

– బిక్కుబిక్కుమంటున్న ప్రజలు. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి :ములుగు జిల్లా మండల కేంద్రమైన వెంకటాపురం పట్టణంలోని పాత మార్కెట్ సెంటర్ కు వెళ్లే రోడ్లో విద్యుత్ తీగలు చేతికందే విధంగా వేలాడుతూ,వుండటంతో, ప్రజలు భయాంధోళనలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక విద్యుత్ స్తంభాలు సైతం వంగి ఏ క్షణంలోనైనా కూలిపోయేందుకు సిద్ధంగా ఉండటంతో, నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్లో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ గిరిజన బాలుర వసతిగృహం, పల్లె దవాఖాన, పోస్ట్ ఆఫీస్, పాత మార్కెట్ సెంటర్ ,చర్చి పేట, మరియు డిసిసిబి బ్యాంకు, ఫంక్షన్ హాల్, ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం, పిఎసిఎస్ కార్యాలయం, తదితర ప్రభుత్వ కార్యాలయాలు కు వెళ్లాలంటే ఈ రోడ్డు గుండానే ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. అంతేగాక ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహానికి దగ్గర్లోనే విద్యుత్ వైర్లు మరియు, డిష్ వైర్లు కిందకు వేలాడుతూ భయాందోళన కు గురి చేస్తున్నాయి. ఈ విషయంపై పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు ప్రజలు ఫిర్యాదు చేసిన పట్టించుకోవటం లేదని, విద్యుత్ ప్రమాదాలు జరగకముందే కిందికి వేలాడే విద్యుత్ వైర్లను తొలగించాలని, ఒరిగి కిందపడే విధంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించాలని, పట్టణ ప్రజలు పత్రికా ముఖంగా వెంకటాపురం విద్యుత్ శాఖ ఏ.డి, ఏ.ఈ లకు పత్రికా ముఖంగా వెంకటాపురం పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.