పడకేసిన పారిశుధ్యం – పట్టించుకోని అధికారులు..?

పడకేసిన పారిశుధ్యం – పట్టించుకోని అధికారులు..?

వాజేడు, తెలంగాణ జ్యోతి : ఎడతెరిపి లేకుండా కురుస్తు న్న భారీ వర్షాలకు మండల కేంద్రంలోని శివాలయం గుడి ముందు వెళ్లే రహదారి పక్కన వర్షపు నీరు భారీగా నిలిచి చెరువుకుంటలా తలపిస్తుంది. డ్రైనేజీలు లేకపోవడం వల్ల ఆ వరద నీరు ఎటు వెళ్లడానికి వీలు లేకుండా ఉండడంతో భారీ గా వరద నీరు చేరి వర్షపు నీరు నిలిచి చుట్టుపక్కల ఇళ్లలోకి వరద వస్తుంది. దానివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటు న్నామని రాత్రి వేళలో బయటికి రావాలంటే భయపడుతు న్నామని అంటున్నారు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోవడంలేదని శివాలయం గుడి ముందు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈవర్షపు నీరు నిలువ ఉండడం వల్ల దోమలు విపరీతంగా తయారై జబ్బుల బారిన పడుతున్నామని అంటున్నారు. అలాగే భారీగా వరద నీరు అందులో చేరడంతో రాత్రి సమయంలో ఇళ్లలోకి విష పురుగులు పాములు, తేళ్లు వస్తున్నాయని ఇంట్లో నుంచి బయటికి రావాలంటే పాములు, తేలు ఎక్కడ కాటు వేస్తాయో నని భయంతో బతుకుతున్నామని అంటున్నారు. ఈ వర్షపు నీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతుందని దానివల్ల అనేక రోగాల బారిన పడుతున్నామని, ఈ సీసీ రోడ్డుపై ఈ దుర్గం ధపు నీరు చేరి సీసీ రోడ్డు సైతం పాకురు పట్టి పలువురు జారి కింద పడిన ఘటనలుకూడా ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధి త శాఖ అధికారులు పట్టించుకోని ఈ వరద నీరు నిలవకుం డా చూడాలని సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవా లని శివాలయం గుడి ముందు గ్రామస్తులు కోరుతున్నారు.