వడ్డీ వ్యాపారస్తులపై పోలీసుల దాడి, 5లక్షలు సీజ్

వడ్డీ వ్యాపారస్తులపై పోలీసుల దాడి, 5లక్షలు సీజ్

ఏటూరునాగారం, తెలంగాణ ప్రతినిధి :మండల కేంద్రంలోని వడ్డీ వ్యాపా రస్తులపై అధిక వడ్డీ వసూలు చేస్తున్నారన్న ఆరోపణలతో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఏఎస్పీ మహేష్ గితే ఆదేశాల మేరకు నమ్మదగిన ఎస్సై కృష్ణ ప్రసాద్ సిబ్బంది తో కలిసి సోదాలు జరిపి సరైన పాత్రలు లేని వారి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎటూరునాగారం గ్రామానికి చెందిన సునీత అనే మహిళ ప్రజలకు అక్రమ వడ్డీకి డబ్బులు ఇస్తూ అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారనే సమాచారం మేరకు సెర్చ్ వారెంట్, పెద్ద మనుషుల సమక్షంలో సోదాలు నిర్వహించగా ఆమె ఇంట్లో బండ్లు, నగదు లభ్యమయ్యాయి. ఆమె ఇంట్లో ప్రామిసరీ నోట్లు, బాండ్లు, పేపర్లు చెక్కులు భూమి పత్రాలు లభించాయి. వాటితో పాటు రూ .4,57,410 లు నగదు లభించాయి. మహిళా ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రజల వద్ద అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారాని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.