రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న పిట్టల శివ
ఏటూరునాగారం, జులై 1, తెలంగాణ జ్యోతి: కన్నాయిగూడెం మండలం చిట్యాల గ్రామానికి చెందిన ఆలం కృష్ణయ్య బి పాజిటివ్ రక్త హీనతతో బాధపడుతున్నట్టు తెలుసుకున్న ఏటూరునాగారం బ్లడ్ డోనర్ పిట్టల శివ వెంటనే స్పందించి సామాజిక ఆసుపత్రిలో రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచారు. శివ మాట్లాడుతూ అన్ని దానాల్లో కెల్లా రక్తదానం గొప్పదని అన్నారు. ఈ సందర్భంగా బ్లడ్ డోనర్స్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సేవా కార్యక్రమాలకు ఎల్లప్పుడూ ప్రోత్సాహం ఇస్తామని అన్నారు.