అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి  

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి 

తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి (కాళేశ్వరం): జయ శంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాలేశ్వరం గ్రావిటీ కాలువలో పడి ఓ వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలియ వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం మంచిర్యాల జిల్లా చింతలపల్లి గ్రామానికి చెందిన నాయితం శేఖర్ (28) అనే వ్యక్తి అత్తగారిల్లు అయిన మహాదేవపూర్ మండలం అన్నారం గ్రామానికి ఆదివారం వచ్చినట్లు సమాచారం. కాగా సోమవారం నీటి ప్రవాహం లేని గ్రావిటీ కాలువలో శవమై కనిపించడం కలకలం రేపింది. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు మహాదేవపూర్ స్టేషన్ ఇంచార్జ్ ఎస్సై చక్రపాణి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.