రైతులకు భరోసా కాంగ్రెస్ చేయూత
– పిఏసిఎస్ చైర్మన్ చల్లా తిరుపతయ్య
తెలంగాణజ్యోతి, కాటారం ప్రతినిధి : రైతాంగానికి ఎల్లవేళ లా అండదండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని అందులో భాగంగా రైతు భరోసా కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక మంథని శాసనసభ్యులు, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు నేతృత్వంలో రైతన్నకి, అన్నదాతకు అన్ని విధాల ఆదుకుంటామని మహాదేవపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు సల్ల తిరుపతయ్య విస్పష్టంగా పేర్కొన్నారు. మంగళవారం మహాదేవపూర్ పీఏసీఎస్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశంలో ఆయన అధ్యక్ష తన జరిగిన సమావేశంలో రైతన్నకి దిశా నిర్దేశం చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాదేవపూర్ సహకార శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు సంఘ అధ్యక్షులు సల్ల తిరుపతయ్య అధ్యక్షతన జిల్లా సహకార అధికారి డి శైలజ ఆధ్వర్యములో నిర్వహించిన రైతు భరోసా సలహాలు సూచనలు పై ప్రత్యేక సర్వ సభ్య సమావేశం సంఘం కార్యవర్గ సభ్యులు,సభ్యులు ఎం పీ పి బి రాణిబాయి, జెడ్ పి టి సి గుడాల అరుణ , ఏ ఈ ఓ లు, సీఈఓ కుమ్మరి రాజబా బు, సిబ్బంది పలిమెల, మహాదేవపూర్ మండల రైతులు పాల్గొని రైతు భరోసా పై పలు సూచనలు అభిప్రాయాలు ఇచ్చి సమావేశాన్ని విజయవంతం చేశారు.