ప్రజలు నిషేధిత పదార్థాలకు దూరంగా ఉండాలి
- కాటారం డిఎస్పి సూర్యనారాయణ
కాటారం, అక్టోబర్ 14, తెలంగాణ జ్యోతి : ప్రభుత్వం నిషేధించిన మత్తు పదార్థాలను వినియోగించవద్దని దూరంగా ఉండాలని కాటారం డిఎస్పి సూర్యనారాయణ అన్నారు. కమ్యూనిటీ కాంటాక్ట్ లో భాగంగా మంగళ వారం మహాదేవపూర్ మండలoలోని ఎడపల్లి ను డీఎస్పీ కాటారం సూర్య నారాయణ,సీఐ మహదేవ్ పూర్ వెంకటేశ్వర్లు లతో కలిసి మహాదేవపూర్ ఎస్సై కే.పవన్ కుమార్ సందర్శించారు.ఈ కార్యక్రమం లో డీఎస్పీ కాటారం సూర్య నారాయణ మాట్లాడుతూ, నెంబర్ ప్లేటు లేని వాహనాలను గుర్తించి వాటికి జరిమానా విధించారు. గ్రామం కూడలిలో గ్రామస్తులతో సమావేశం అయ్యారు. నిషేధిత పదార్థాలైన గుడుంబాను, గంజాయి, గుట్కా లను ప్రోత్సహించవద్దని, ఎవరైనా విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత బాగా చదువుకొని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. కొత్తవారు ఎవరు వచ్చిన తమకు సమాచారం అందించాలని, అలాగే మీ ఊరి నుండి ఎవరైనా సొంత గ్రామాలకు వెళ్లిపోయిన ఆ సమాచారం మాకు తప్పకుండా తెలియజేయాలని తెలిపరూ, కొత్తవారు ఎవరు ఊరి లోకి వచ్చిన పోలీసులకి సమాచారం అందించాలని సూచించారు. ఊరిలో ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని అని, వాటిని పరిష్కరించడానికి తమ వంతు కృషి చేస్తామని తెలపడం జరిగింది. అలాగే పది లీటర్ల గుడుంబాను సీజ్ చేసినట్లు తెలిపారు. మూడు నెంబర్ ప్లేట్ లేని వెహికిల్ లను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ లు కే. పవన్ కుమార్, ఎస్ ఐ -2 శశాంక్ , పలిమెల రమేష్, కాళేశ్వరం ఎస్ ఐ తమాషా రెడ్డి సివిల్ పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.