ప్రజలు ఎండాకాలంలో అప్రమత్తంగా ఉండాలి.
ప్రజలు ఎండాకాలంలో అప్రమత్తంగా ఉండాలి.
– మహాదేవపూర్ ప్రభుత్వ దావఖాన సూపరింటెండెంట్ గంట చంద్రశేఖర్.
తెలంగాణ జ్యోతి, మహాదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని సామజిక ఆరోగ్య కేంద్రం (సి హెచ్ సి) సూపరింటెండెంట్ డాక్టర్ గంట చంద్రశేఖర్ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని బుధవారంనాడు ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. ఎండా కాలంలో ప్రజలు చేయకూడనివి (మండుటెండలలో ) వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రత సమయంలో ఎక్కువ తిరగరాదు అని సూచించారు. సూర్య కిరణాలకు వేడిగాలికి గురికాకూడదు రోడ్డుమీద చల్లని రంగుపానియలు త్రాగరాదు, రోడ్డుమీద అమ్మే కలుషిత ఆహారం తినరాదు, సాధ్యమైనంత వరకు మాంసాహారం తగ్గించాలి. మద్యం సేవించరాదు, ఎండ వేళలో శరీరంపై భారం పడు శ్రమ గల పనులు చేయరాదు అని తెలిపారు. చేయవలసినవి నీళ్లు, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ,ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవచ్చును అని సూచించారు. రోజుకు కనీసం 15 గ్లాసుల నీరు తాగాలని కోరారు. పరిశుభ్రతకు అధిక ప్రధాన్యత ఇవ్వాలి అని,శుభ్రంగా రెండు పూటల స్నానం చేయటం,భోజనం మితంగా చేయాలి, ఎండ వేళలో ఇంటిపట్టునే ఉండండి బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు లేదా టోపీ వంటివి తీసుకొని వెళ్ళండి అని సూచించారు.ఇంట్లో కిటికీలు తెరిచి ఉంచాలి ఫ్యాన్ వేసి చల్లగా ఉంచుకోవాలి వడదెబ్బ తగిలితే ప్రమాద చికిత్స వడదెబ్బ తగిలిన వ్యక్తిని నీడ గల ప్రదేశానికి చేర్చాలి. చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరమంతా తుడవాలి శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చేంతవరకు తడి గుడ్డతో తుడుస్తూనే ఉండాలి ఫ్యాను గాలి కానీ చల్లని గాలి తగిలేలా ఉంచాలి. మజ్జిగ లేదా చిటికెడు ఉప్పు కలిపిన గ్లూకోజ్ ద్రవణం లేదా ఓఆర్ఎస్ త్రాగించవచ్చును అని అన్నారు. వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలో ఉన్న రోగికి నీరు తాగించకూడదు వీలైనంత త్వరగా దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలని మహాదేవపూర్ సామజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ గంట చంద్రశేఖర్ ఒకప్రకటనలో తెలిపారు.