గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : ఏటూరునాగారం 163 జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాదంలో మృతి చెంది న ద్విచక్ర వాహనదారున్ని మంగపేట మండలం కమలా పురం కు చెందిన గుగ్గిళ్ళ రమేష్ గా గుర్తించారు. జరిగిన ప్రమాదం తీరుపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. రహదారికి ఇరువైపులా ఇసుక లారీలు నిలపడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇసుక లారీలను అధికారులు నియంత్రించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని గుసగుసలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికైనా హైవే రహదారికి ఇరువైపులా లారీలను నిల్పకుండా చర్యలు తీసుకోవాలని పలువురు అధికారులను వేడుకుంటున్నారు.