నూగూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం

నూగూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం

– ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి :  నూగూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల లో ఉన్న ఏఎంసీ కార్యాలయంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య హాజరై చైర్మన్, పాలకమండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వెంకటాపురం, వాజేడు, చర్ల ప్రాంతాలు కు చెందిన కాంగ్రెస్ నాయకులు నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. చర్ల మండలానికి చెందిన ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఇర్ఫా శ్రీని వాసరావు ను నామినేట్ చేశారు. అలాగే వాజేడు మండలానికి చెందిన పూనెం రాంబాబు ను వైస్ చైర్మన్ గా నియమించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ లో వాజేడు, వెంకటాపురం, చర్ల తదితర మూడు మండలాలు ఉన్నాయి. వెంకటాపురం, వాజేడు మండలాలు ములుగు జిల్లాలో కొనసాగుతుండగా, చర్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొనసాగుతున్నది. పాలకవర్గ మెంబర్లుగా కారం కన్నయ్య, శ్యామల సీత,ఉఇకా వెంకటేశ్వర్లు, కారం జోగారావు, బి. చంద్రయ్య, ఆలం సత్యనారాయణ, పోశెట్టి గౌరయ్య, పాయం వెంకటరామయ్య, పోడియం సింగయ్య, యాలం సాయి పాలకవర్గం మెంబర్లుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చర్ల కార్యదర్శి మరియు అధికారులు పాల్గొన్నారు. అలాగే మార్కెట్ కమిటీ నిబంధనల ప్రకారం సొసైటీ అధ్యక్షులు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి, గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి కూడా సభ్యులుగా కొనసాగుతారని తెలిపారు.