బండారుపల్లిలో ఘనంగా నవగ్రహ విగ్రహప్రతిష్ఠాపన

బండారుపల్లిలో ఘనంగా నవగ్రహ విగ్రహప్రతిష్ఠాపన

బండారుపల్లిలో ఘనంగా నవగ్రహ విగ్రహప్రతిష్ఠాపన

– ప్రత్యేక పూజలు చేసిన భక్తులు

ములుగుప్రతినిధి: ములుగు మండలం బండారుపల్లి గ్రామం లో శ్రీ సీతారామాంజనేయస్వామి ఆలయంలో గురువారం నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. గ్రామంలో గత ఆరు నెలల క్రితం నిర్మించి కొలువుదీర్చిన రామాలయంలో దేవతా మూర్తులను ప్రతిష్ఠించగా ఆలయ కమిటీ చైర్మన్ అక్కల రవి ఆధ్వర్యంలో నవగ్రహ విగ్రహాలను ప్రతిష్ఠించారు. వేద పండితులు సముద్రాల శ్రీనివాసాచార్యుల బృందం ఆధ్వర్యంలో గ్రామస్థులు మూడు రోజులుగా ప్రత్యేక పూజలు, అభిశేకాలు నిర్వహించారు. చివరి రోజున నవగ్రహ విగ్రహాలను ప్రతిష్ఠించారు. గ్రామస్థులు భారీ సంఖ్యలో హాజరై నవగహ్రాలకు పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామాలయ నిర్మాణ కమిటీ సభ్యులు మాజీ సర్పంచ్ అక్కల రఘోత్తం, బుద్దె వీరన్న, బస్వోజు మొగిళి, కొండి సాంబశివ, చంద్రగిరి కుమార్ గౌడ్, అప్పని వీరస్వామి, పెండెం భిక్షపతి, కంచరకుంట్ల రవీందర్ రెడ్డి, మురళీధర్,  సంకటి మల్లయ్య, అలువాల రాజ్ కుమార్, రామాలయ ప్రధాన పూజారి బుసిగొండ రవీందర్, గ్రామపెద్దలు, భక్తులు, తదిత రులు పాల్గొన్నారు.