మల్లంపల్లి ఇక మండలం

Written by telangana jyothi

Published on:

మల్లంపల్లి ఇక మండలం

– జీవో 125 విడుదల చేసిన రాష్ర్ట ప్రభుత్వం

– ములుగు జిల్లాలో 10మండలాలు

ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : ప్రత్యేక మండలం కావాలని కోరుతూ ఏళ్ల తరబడి మల్లంపల్లి వాసులు చేసిన నిరీక్షణలకు తెరపడింది. గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లా ములుగు మండలం మల్లంపల్లిని ప్రత్యేక మండలంగా ప్రకటిస్తూ జీవో 125 విడుదల చేసింది. మల్లంపల్లి, రాంచంద్రాపూర్ రెవెన్యూ గ్రామాలు, వాటి పరిధి లోని గ్రామపంచాయతీలను కలుపుకొని ప్రత్యేక మండలంగా ప్రకటిస్తూ రాష్ర్ట ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు వెలువరించారు. ప్రత్యేక మండలం కోసం చేప ట్టిన పోరాటాలు ఫలించాయని, ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చిందని మల్లంపల్లి వాసులు సంతోషం వ్యక్తం చేస్తు న్నారు. ములుగు మాజీ జడ్పీ చైర్ పర్సన్, దివంగత నేత కుసుమ జగదీష్ పేరున మల్లంపల్లిని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉండగా ప్రభుత్వం మల్లంపల్లి పేరుతోనే జీవో విడుదల చేసింది.

– మల్లంపల్లితో ములుగు జిల్లాలో 10మండలాలు

ములుగు జిల్లాలో ములుగు, వెంకటాపూర్, గోవింద రావు పేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట మండలాలతో పాటు నూతనంగా ఏర్పాటైన కన్నాయిగూడెం, ఖమ్మం జిల్లాలోని వాజేడు, వెంకటాపురం మండలాలను కలుపుతూ మొత్తం 9 మండలాలతో జిల్లాను ఏర్పాటు చేశారు. అయితే గురువారం ప్రభుత్వం విడుదల చేసిన జీవోతో మల్లంపల్లి మండలాన్ని కలుపుకొని 10మండలాలు అయ్యాయి. 2016లో జిల్లాల పునర్విభజన జరుగగా అప్పటి నుంచి ములుగు జిల్లా కోసం మల్లంపల్లి ప్రత్యేక మండలం కోసం పోరాటాలు జరిగాయి. 2019, ఫిబ్రవరి 17న ములుగును జిల్లాగా ప్రకటించినప్పటికీ మల్లంపల్లిని మాత్రం వదిలేశారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మల్లంపల్లిని మండలంగా ఏర్పాటు చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే అందులో కూడా పార దర్శకత లోపించడంతో అది ఆగిపోయింది. కాగా, రాష్ర్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ దనసరి సీతక్క స్పష్టమైన హామీ మేరకు ప్రభుత్వం 125 జీవో విడుదల చేయడంతో హర్షాతిరే కాలు వెల్లువెత్తుతున్నాయి. మల్లంపల్లి మండలం లో మల్లం పల్లి, మహ్మద్గౌస్పల్లి, రాంచంద్రాపురం, పందికుంట, కొడిశెల కుంట, శివతండా, ముద్దునూరు తండా, దేవనగర్, శ్రీనగర్, గుర్తుర్తండా గ్రామపంచాయతీలు అంతర్భా గమయ్యాయి. మొత్తం 10జీపీలు మల్లంపల్లి మండలంలో కొనసాగనుండగా ములుగు మండలంలో 22జీపీలు మాత్రమే ఉండనున్నాయి

మల్లంపల్లి ఇక మండలం

–మంత్రిసీతక్కకు మల్లంపల్లి మండలప్రజల కృతజ్క్షత లు

మల్లంపల్లి మండలం కోసం మండల సాధన సమితి ఏర్పాటు చేసుకొని నెలల తరబడి ఉద్యమాలు చేసిన యువకులు, గ్రామస్థులు ఆ కళ నెరవేరడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్రలు, ధర్నాలు, నిరసన దీక్షలు చేసినందుకు తమ కు ఫలితం దక్కిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందుకు గాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రాష్ట్ర మంత్రి సీతక్కకు సోషల్ మీడియా ద్వారా మండల సాధన సమితి నాయ కులు, ఉద్యమ జేఏసీ నాయకులు, వివిధ పార్టీల నేతలు కృతజ్క్షతలు తెలిపారు. అదేవిధంగా మల్లంపల్లిలో పుట్టి పెరిగి న మాజీ జడ్పీ చైర్ పర్సన్ దివంగత కుసుమ జగదీష్ కళ సాకారమైనట్లు మండల ప్రజలు భావిస్తున్నారు. కాగా, మల్లం పల్లి, రాంచంద్రాపూర్ గ్రామాల్లో బాణాసంచా కాల్చుతూ స్వీట్లు పంపిణీ చేసుకొని సంబురాలు జరుపుకున్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now