పుల్లూరి నాగేశ్వర్ కు సంగీత సాహిత్య పురస్కారం
పుల్లూరి నాగేశ్వర్ కు సంగీత సాహిత్య పురస్కారం
తెలంగాణ జ్యోతి ప్రతినిధి, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం వాసి, కవి, రచయిత, గాయకులు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కాటారంలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న అధ్యాపకులు పుల్లూరి నాగేశ్వర్ కి శ్రీ వివేకానంద సేవ సమితి భూపాలపల్లి జిల్లా వారు సంగీత సాహిత్య ఆధ్యాత్మిక రంగంలో విషిష్ట సేవలు అందిస్తున్నందుకు గాను ఈ క్రోధి నామ సంవత్సర ఉగాది పురస్కారం ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా క్రేందంలోని మార్గదర్శి ఉన్నత పాఠశాల లో జరిగిన ఉగాది పురస్కార వేడుకల్లో ప్రధానం చేయడం జరిగింది. ఈ సత్ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఆర్ విద్యాసంస్థలు ఓరుగల్లు అధినేత నాయినేని సంపత్ రావు, కాటారం ఆదర్శ విద్యా సంస్థల అధినేత జనగామ కరుణాకర్ రావు, చలనచిత్ర నటుడు నిర్మాత దాము,సాహిత్య సేవకులు అప్పం కిషన్, శ్రీ చైతన్య మహిళా డిగ్రీ పీజీ కళాశాల భూపాలపల్లి యం యస్ మూర్తి, వివేకానంద సేవా సమితి వ్యవస్థాపకులు ప్రముఖ కవి రచయిత తెలుగు అధ్యాపకులు కొలుగూరి సంజీవరావు, మొదలగు ప్రముఖుల చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందని పురస్కారం అందించిన నిర్వాహకులకు పుల్లూరి నాగేశ్వర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.