గణపతి నవరాత్రి మహోత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు
గణపతి నవరాత్రి మహోత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు
– గ్రామ గ్రామాన నవరాత్రి ఉత్సవ కమిటీలు
– మార్కెట్లో రకరకాల సైజులలో శ్రీ వినాయక విగ్రహాలు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : శ్రీ గణపతి నవరాత్రులు మహోత్సవాలకు ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాలలో ఉత్సవ కమిటీలు ముమ్మర ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 7వ తేదీన శ్రీ వినాయక చవితి పర్వదినం సందర్భంగా గ్రామాలలో గణపతి నవరాత్రి ఉత్సవాల కమిటీలను ఏర్పాటు చేసుకొని మండలంలోని 18 పంచాయితీలలో గ్రామాలలో వినాయక చవితి మహోత్స వాలు జరుపు కునేందుకు ఇప్పటికే తాత్కాలిక మండపాలు టెంట్ల ఏర్ఫాటు, స్థలాలను శుబ్రపరిచే కార్యక్రమాలు ముమ్మ రంగా కొనసాగుతున్నాయి. మార్కెట్లో రకరకాల సైజులు వినాయక విగ్రహాలను అమ్మకానికి ఉంచగా ఉత్సవ కమిటీ ప్రతినిధులు వినాయకులకు అడ్వాన్సులు సైతం చెల్లించారు.