వైఎస్సార్ ప్రజలకు చేసిన సేవలు మరువరానివి
వెంకటాపురంనూగూరు, తెలంగాణజ్యోతి : ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలు మరువరానివని, పేద ప్రజల గుండెల్లో నేటికీ వైయస్సార్ నిలిచి ఉన్నారనీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, పీఏసీఎస్ చైర్మన్ చిడెం మోహన్ రావు అన్నారు. సోమవారం ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండ ల కేంద్రంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రివర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, కాంగ్రెస్ నాయకులు ఘనం గా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన సేవలను నాయకులు కొని యాడారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిడెం శివ, కాంగ్రెస్ నాయకులు రమేష్, తోట శీను, ధనపనేని నాగరాజు, చిట్టెం సాయి, ఐలయ్య యాదవ్ మాజీ ఎంపిటిసి సీతాదేవి తదితరులు పాల్గొన్నారు.