మహిళా దినోత్సవం సందర్భంగా శుభవార్త చెప్పిన మోదీ

మహిళా దినోత్సవం సందర్భంగా శుభవార్త చెప్పిన మోదీ

గ్యాస్ సిలిండర్ 100 రూపాయలు తగ్గింపు

డెస్క్ : మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోదీ శుభవార్త చెప్పారు. వంట గ్యాస్ సిలిండర్ పై రూ.100 తగ్గిస్తున్నట్లు, దీనితో లక్షలాది కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు. ముఖ్యంగా ‘నారీశక్తి’కి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. వంటగ్యాస్ ను అందుబాటు ధరలో అందించటం వల్ల కుటుంబాల శ్రేయస్సుకు మద్దతునిస్తున్నామని మోదీ తెలిపారు. తద్వారా వారికి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. మహిళా సాధికారత, సులభతర జీవన విధానాన్ని అందించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.