మేడారంలో హెల్త్ క్యాంపు
ములుగు, తెలంగాణ జ్యోతి : మేడారం మహాజాతర ముగిసిన సందర్భంగా భక్తులు వదిలిన వ్యర్థాలతో స్థానికులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య ఆదేశాలమేరకు మేడారంలో మెల్త్ క్యాంపు నిర్వహించారు. వైద్యాధికారి డాక్టర్ రణధీర్ మేడారం పరిసరాల్లో గ్రామస్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి పరిశుభ్రత పాటించాలని, వ్యర్థాలు ఉంటే వెంటనే పారిశుధ్య కార్మికులకు తెలపాలని సూచించారు. ఒకే చోట వ్యర్థాలను వేయాలన్నారు. ఆరోగ్య సర్వే నిర్వహించి అనారోగ్యంతో ఉన్నవారికి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వోయూ వెంకటేశ్వర్ రెడ్డి, కాటాపూర్ పీహెచ్సీ ఎంఎల్హెచ్పీ సాయిచందు, రాజేశ్వరి, ముత్తయ్య, ఆశ, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.