క్రిస్మస్ వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు
క్రిస్మస్ వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : మానవవాళికి ప్రేమ, శాంతిమార్గం చూపిన మహనీయుడు ఏసుక్రీస్తు అని, అతడి అనుగ్రహం అందరిపైనా ఉండాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. స్థానిక కాటరం బీఎల్ ఎం గార్డెన్లో తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించా రు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటీ. పరిశ్రమల. శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు హాజరయ్యా రు. క్రైస్తవ మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంత రం క్రైస్తవ సోదరులు మంత్రి శ్రీధర్ బాబును శాలువాతో సత్కరించారు.