వన్యప్రాణుల వేట నివారణపై అధికారులతో సమావేశం
వన్యప్రాణుల వేట నివారణపై అధికారులతో సమావేశం
– కాళేశ్వరం పోలీసులు
మహాదేవపూర్,తెలంగాణజ్యోతి:మహదేవపూర్ మండలం లోని కాళేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోని చండ్రుపల్లి గ్రామం లో జిల్లా ఎస్పీ కిరణ్ ఖరె ఆదేశాల మేరకు కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసుశాఖ, అటవీశాఖ, ఎలక్ట్రిసిటి శాఖ అధికారులతో అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల వేట కోసం అమర్చే ఉచ్చులు, విద్యుత్ తీగల నివారణకు సమన్వయ సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం పోలీసులు ప్రభుత్వ పాఠశాలలో ప్రజలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహదేవపూర్ సిఐ రాజేశ్వరరావు, కాళేశ్వరం ఎస్సై భవానిసేన్ వన్య ప్రాణుల వేట నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలు అనుసరించాల్సిన అంశాలపై అధికారులతో చర్చించారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వేట కోసం విద్యుత్ తీగలు, ఉచ్చులు బిగించరాదని స్థానికులకు పోలీసులు హెచ్చరిం చారు. వన్యప్రాణులను వేటాడే వారు, మాంసం విక్రయించే వారి వివరాలు తెలియజేయాలని వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని అన్నారు. బైండోవర్ చేసాక వేటకు పాల్పడితే పీడియాక్టులు నమోదు చేస్తామని హెచ్చరించారు.విద్యుత్ వైర్లు ఉచ్చులు కారణంగా వన్యప్రాణులు, మూగజీవాలతో పాటు అమాయక ప్రజలు, రైతులు చనిపోయే అవకాశం ఉందని స్తానికులకు వివరించారు.ఈ కార్యక్రమంలో మహదే వపూర్ సిఐ రాజేశ్వరరావు ,కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ , మహదేవపూర్ ఎఫ్ ఆర్ ఓ కమలాదేవి,బీట్ ఆఫిసర్ శ్రీను, ఎలక్ట్రిసిటి లైన్ ఇన్స్పెక్టర్ సదానందం, జిపి సెక్రటరీ సురేష్, అధిక సంఖ్యలో ఫారెస్ట్ ,పోలీస్ సిబ్బంది,స్తానికులు ఉన్నారు.