ప్రభుత్వ పాఠశాలలో చోరీకి యత్నం..?
ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : ఏటూరునాగారం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి యత్నించిన సంఘటన చోటు చేసుకుంది. పాఠశాలకు సెలవులు ప్రకటించడంతో తరగతి గదులకు తాళాలు వేసి సీల్ చేశారు. శనివారం సాయంత్రం పాఠశాల వెనక క్రీడామైదానంలో వాకింగుకు వెళ్లిన పలువురు తలుపులు పగలగొట్టి ఉండడం గమనించారు. సుమారు 8 తరగతి గదుల్లో లక్షలు విలువచేసే డిజిటల్ టీవీలు, బ్యాటరీలు గతంలో ఏర్పాటు చేశారు. వాటిలో ఏమైనా దొంగిలించబడ్డాయా తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ ప్రారంభించారు.